New movie in Amitabh - Rajinikanth combination

Rajinikanth: సీనియర్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇటీవల లాల్ సలాం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన రజిని పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. ఇక ఈ సినిమా కన్నా ముందు రజిని నటించిన జైలర్ మూవీ ఎంత పెద్ద విజయం అయిందో మనందరికీ తెలిసిందే. అటువంటిది లాల్ సలాం సినిమాతో ఆ హిట్ నుంచి ఫ్లాప్ కి వచ్చేసాడు రజినీకాంత్.

New movie in Amitabh – Rajinikanth combination

రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ఈ మూవీని నిర్మించింది. అప్పటివరకు వరస హ్యాట్రిక్ హిట్లు కొడుతూ మంచి జోరుపై కొనసాగుతున్న రజినీకాంత్ ని ఒక్కసారిగా ఫ్లాప్ లిస్టులో చేర్చింది ఐశ్వర్య. దీంతో రజిని అభిమానులు బాగా నిరాశ చెందారు. అయినప్పటికీ తన నెక్స్ట్ సినిమాపై ఫుల్ హైప్స్ పెట్టుకున్నారు. ఇక ప్రస్తుతం రజనీకాంత్ గురించి ఓ వార్త వైరల్ అవుతుంది.

Also Read: Beauty Tips: వాట్.. ఐస్ క్యూబ్స్ ఫేస్ పై రబ్ చేయడం వల్ల ఇన్ని ఉపయోగాలా..!

రజనీకాంత్ మరియు అమితాబచ్చన్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ బాలీవుడ్ హీరో అమితాబచ్చన్ కొత్త స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో వీరిద్దరూ కలిసి కొన్ని హిందీ సినిమాల్లో నటించారు. ఇక ఇప్పుడు చాలా ఏళ్లు తర్వాత రజనీకాంత్ మరియు అమితాబచ్చన్ కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ” వెటయ్యర్ “.

New movie in Amitabh - Rajinikanth combination

జై భీమ్ మూవీ డైరెక్టర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను ముంబైలో స్టార్ట్ చేసింది మూవీ టీం. ఇక ఈ షెడ్యూల్లో అమితాబచ్చన్, రజిని కాంబోలో పలు సీన్స్ తీస్తున్నారు. ఆ వర్క్ స్టిల్స్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. తెలుగులో ఈ సినిమా వేటగాడు పేరుతో రానుంది. ప్రస్తుతం ఈ సినిమాపై భారీ హైప్స్ ఏర్పడ్డాయి. అపజయంతో ఉన్న రజనీకి ఈ సినిమా ఎటువంటి ఆశ కలిగిస్తుందో చూడాలి మరి.(Rajinikanth)

Join WhatsApp