New Update On Trivikram Srinivas Next Project

Trivikram Srinivas: టాలీవుడ్ లో ఉన్న టాప్ డైరెక్ట‌ర్స్ లో త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఒక‌రు. ర‌చ‌యిత‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయ‌న‌.. ఆ త‌ర్వాత స్టార్ డైరెక్ట‌ర్ గా ఎదిగారు. త‌న‌దైన మార్క్ డైలాగ్స్ తో మాట‌ల మాంత్రికుడితో పేరు తెచ్చుకున్నారు. చాలా గ్యాప్ త‌ర్వాత త్రివిక్ర‌మ్ నుంచి ఇటీవ‌ల వ‌చ్చిన చిత్రం గుంటూరు కారం. ఈ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా న‌టిస్తే.. శ్రీ‌లీల‌, మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా చేశారు. ర‌మ్య‌కృష్ణ‌, జ‌య‌రామ్‌, ప్ర‌కాష్ రాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

New Update On Trivikram Srinivas Next Project

హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధా కృష్ణ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుక‌గా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. టాక్ అంత గొప్పగా రాక‌పోయినా.. ఫ్యాన్స్ ను అల‌రించే విధంగా సినిమా ఉంద‌ని చాలా మంది అభిప్రాయ‌ప‌డ్డారు. ప‌ర్ఫామెన్స్ ప‌రంగా, డ్యాన్సుల ప‌రంగా మ‌హేష్ బాబు ఇర‌గ‌దీసేవాడు. కానీ, త్రివిక్ర‌మ్ మ్యాజిక్ మాత్రం మిస్ అయింది. అయితే ఫెస్టివ‌ల్ అడ్వాంటేజ్ ఉండ‌టం వ‌ల్ల గుంటూరు కారం బాక్సాఫీస్ వ‌ద్ద అద‌ర‌హో అనేలా వ‌సూళ్ల‌ను సొంతం చేసుకుంది.

గుంటూరు కారం త‌ర్వాత మ‌హేష్ బాబు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళితో ఓ భారీ బ‌డ్జెట్ సినిమా చేసేందుకు రెడీ అయిపోయాడు. త్రివిక్ర‌మ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవ‌రితో..? అన్న‌ది ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన ప్ర‌శ్న‌. గ‌తంలో ఎన్టీఆర్ తో అయిననూ పోయిరావలెను హస్తినకు అనే సినిమాను త్రివిక్ర‌మ్ ప్ర‌క‌టించారు. కానీ, ఈ చిత్రం కార్య‌రూపం దాల్చ‌లేదు. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ లో త్రివిక్ర‌మ్ కు ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చే ప‌రిస్థితే లేనే లేదు.(Trivikram Srinivas)

Also Read: Okkadu: న‌మ్ర‌త చేయాల్సిన ఒక్క‌డు మూవీ భూమిక చేతికి ఎలా వెళ్లింది.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

అయితే త్రివిక్ర‌మ్ గ‌తంలో అల్లు అర్జున్ తో కూడా ఓ మూవీని అనౌన్స్ చేశారు. కానీ, అల్లు అర్జున్ కొర‌టాల శివ‌, సందీప్ రెడ్డి వంగా వంటి డైరెక్ట‌ర్స్ కు కూడా క‌మిటై ఉన్నాడు. అందువ‌ల్ల పుష్ప 2 అయ్యాక త్రివిక్రమ్ కి ఆయ‌న‌ డేట్స్ ఇస్తాడా లేదా అన్న‌ది క్లారిటీ ఇచ్చారు. ఇక‌పోతే గ‌త కొంత కాలం నుంచి రామ్ పోతినేని లేదా న్యాచుర‌ల్ స్టార్ నానితో త్రివిక్ర‌మ్ నెక్స్ట్ ఉంటుందని ప్ర‌చారం జరుగుతోంది. ప్ర‌స్తుతం అల్లు అర్జున్‌, రామ్ మ‌రియు నానిల‌పై త్రివిక్ర‌మ్ క‌న్నేశార‌ని ఇన్‌సైడ్ టాక్ ఉంది. అంతేకాకుండా కోలీవుడ్ స్టార్ సూర్య సైతం త్రివిక్ర‌మ్ లైన‌ప్‌లో ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి త్రివిక్ర‌మ్ త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ఎవ‌రితో ప్ర‌క‌టిస్తారో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Join WhatsApp