Nidhhi Agerwal Break up with her boyfriend

Nidhhi Agerwal: హీరోయిన్ నిధి అగర్వాల్.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ హోదాలోకి వెళ్లిపోయిన ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న హరిహర వీరమల్లు అనే మూవీలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. అయితే ఈ షూటింగ్ ప్రస్తుతం వాయిదా పడ్డప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అంటే మామూలు విషయం కాదు. ఆ సినిమా హిట్ అయిన హిట్ కాకపోయినా హీరోయిన్ మాత్రం స్టార్ రేంజ్ కి వెళ్లాల్సిందే.

Nidhhi Agerwal Break up with her boyfriend

ఇక ఈ ముద్దుగుమ్మ నాగచైతన్య సవ్యసాచి మూవీతో తెలుగు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత అక్కినేని అఖిల్ తో మిస్టర్ మజ్ను సినిమాలో కూడా చేసినప్పటికీ ఈ అన్నదమ్ముల సినిమాలు నిధికి ఎలాంటి గుర్తింపు కూడా తెచ్చిపెట్టలేదు.కానీ ఇస్మార్ట్ శంకర్ సినిమా మాత్రం ఈ హీరోయిన్ కి స్టార్ ఇమేజ్ తెచ్చింది. (Nidhhi Agerwal)

Also Read: Akhil: ఆ హీరోయిన్ ప్రేమలో అఖిల్.. అక్కినేని ఇంటికి చిన్న కోడలు దొరికేసిందా..?

అలాగే ఈమె హరిహర వీరమల్ల సినిమాతో పాటు ప్రభాస్ హీరో గా చేస్తున్న ఓ మూవీలో కూడా హీరోయిన్ ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా నిధి అగర్వాల్ ప్రియుడికి బ్రేకప్ చెప్పింది అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అదేంటంటే నిధి అగర్వాల్ గత కొద్ది రోజులుగా ఒక నటుడితో పీకల్లోతు ప్రేమలో మునిగి పోయిందట. అయితే చాలా సాఫీగా సాగుతున్న వీరి లవ్ లైఫ్ లో ప్రియుడు గురించి ఒక చేదు నిజం నిధి అగర్వాల్ కి తెలిసిందట.

Nidhhi Agerwal Break up with her boyfriend

\తన లవర్ కి అంతకుముందే వేరే అమ్మాయిలతో అఫై** ఉన్నాయి అన్న విషయం తెలుసుకున్న నిధి అగర్వాల్ ప్రస్తుతం ఆయనకి బ్రేకప్ చెప్పేసి ఒంటరిగానే ఉంటుందట. అంతేకాదు ఇప్పుడు తన జీవితంలో ప్రేమ వంటి వాటికి చోటు ఇవ్వకుండా పూర్తిగా తన ఫోకస్ మొత్తం సినిమాల మీదే పెట్టాలని నిర్ణయం తీసుకుందట. ఇక ప్రస్తుతం నిధి అగర్వాల్ బ్రేకప్ గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది.(Nidhhi Agerwal)

Join WhatsApp