Niharika & Jonnalagadda Chaithanya Divorce News

Niharika: ఈ మధ్యకాలంలో నిహారిక విడాకుల వార్తలు ఎంత పెద్ద వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఫస్ట్ టైం నిహారిక తన విడాకుల గురించి ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన వీడియో బయట పెట్టడంతో ఈమె మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. అంతేకాదు నిహారిక మాట్లాడిన విడాకుల వార్తలకు కౌంటర్ గా జొన్నలగడ్డ చైతన్య కూడా స్పందించడం మరింత హాట్ టాపిక్ అయింది. అయితే పెళ్లి తర్వాత నిహారికకు ఫ్రీడం కరువైందని,ఈ కారణంతోనే ఆమె విడాకులు ఇచ్చినట్లు అర్థమవుతుంది.

Niharika & Jonnalagadda Chaithanya Divorce News

అలాగే చైతన్య ఈ విడాకుల విషయంపై స్పందిస్తూ విడాకుల్లో రెండు చివరలు ఉంటాయి.ఒకరిని నిందించడం మరొకని హైలెట్ చేయడం మంచిది కాదు. ఈ విషయంలో మూడో వ్యక్తి జోక్యం చేసుకోకూడదు అంటూ గట్టిగానే ఇచ్చి పడేశారు. అయితే నిహారిక జొన్నలగడ్డ చైతన్య ఇద్దరి మధ్య విభేదాలు రావడానికి మరొక ప్రధాన కారణముందట. అదేంటంటే జొన్నలగడ్డ చైతన్య ఎప్పుడైతే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన నిహారికను పెళ్లి చేసుకున్నారో అప్పటినుండి ఇండస్ట్రీలో ఉండే చాలామంది సెలబ్రిటీలు ఆయనకు స్నేహితులైపోయారట.

Also Read: Shraddha Das: ఆ హీరోయిన్ న‌న్ను చిత‌క‌బాదింది.. 30 గాయాలతో హాస్ప‌ట‌ల్‌లో చేరానంటూ శ్రద్ధా దాస్ ఆవేద‌న‌!

అలా నిహారిక కారణంగా ఓ యంగ్ హీరోయిన్ కూడా చైతన్యకు చాలా మంచి స్నేహితురాలు అయిందట. అయితే వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం చివరికి నిహారికని మోసం చేసి ఆ యంగ్ హీరోయిన్ తో ఎఫై** పెట్టుకునే వరకు వచ్చిందట. అలా ఓ రోజు ఆ యంగ్ హీరోయిన్ తో తన భర్తతో చూసిన నిహారిక తట్టుకోలేకపోయిందట. అప్పటి నుండి ఆ చైతన్య మాట్లాడినప్పుడల్లా నిహారికకి ఈ విషయం గురించి ఆ హీరోయిన్ పేరు ప్రస్తావించకుండానే చాలాసార్లు నిహారిక చైతన్య తో గొడవ పెట్టుకుందట . దాంతో గొడవలు ఎక్కువవ్వడంతో కలిసి ఉండలేక ఇద్దరు పెద్దలు అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.

Niharika,Jonnalagadda Chaithanya Divvorce news

అయితే విడాకుల తర్వాత ఓ ఇంటర్వ్యూలో నిహారిక నేను చాలా నమ్మాను కానీ ఇలా ఉంటుందనుకోలేదు. రాంగ్ పర్సన్ మీద ఆధారపడకూడదు అంటూ కొన్ని పరోక్ష కామెంట్లు చేసింది. దాంతో చాలా మంది ఇండస్ట్రీ జనాలు నిహారిక విడాకుల కి కారణం భర్త వేరే మహిళతో కలిసి ఉండటమే అని ఓ విషయం వైరల్ చేశారు. అంతేకాదు జొన్నలగడ్డ చైతన్య ఆ యంగ్ హీరోయిన్ తో పబ్బులు,పార్టీలు అంటూ తిరగడం ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది కూడా చూశారనే టాక్.ఈ కారణంతోనే నిహారిక తన భర్తకు విడాకులు ఇచ్చినట్లు సమాచారం.(Niharika)

Join WhatsApp