Niharika Konidela About Her Divorce

Niharika Konidela: మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నాగ‌బాబు కూతురిగా మెగా ఫ్యామిలీ నుంచి ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఏకైక హీరోయిన్ నిహారిక‌నే. యాక్టింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో చాలా ఆశ‌లు పెట్టుకుని నిహారిక సినీ గ‌డ‌ప తొక్కుంది. షార్ట్ ఫిల్మ్స్‌, టీవీ షోల‌తో స్టార్ట్ చేసి.. ఆ త‌ర్వాత వెండితెర‌పై హీరోయిన్ గా అడుగు పెట్టింది. ఒక మనసు, హ్యపి వెడ్డింగ్, సూర్యకాంతం వంటి చిత్రాలు చేసింది. కానీ, అవి అనుకున్న రేంజ్ లో ఆడ‌లేదు.

Niharika Konidela About Her Divorce

ఇంత‌లోనే నిహారిక ఓ ఇంటివి అయింది. 2020 డిసెంబర్‌లో గుంటూరు ఐజి జె.ప్రభాకర్ కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో నిహారిక ఏడడుగులు వేసింది. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో అంత‌రంగ వైభ‌వంగా వీరి వివాహం జ‌రిగింది. కానీ, పెళ్లైన ఏడాదికే ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు త‌లెత్తాయి. ఆ విభేదాలు విడాకుల‌కు దారి తీశాయి. 2023లో నిహారిక‌, చైత‌న్య‌లు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో పరస్పరం అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.

Also Read: Double Ismart: హాట్ టాపిక్ గా డ‌బుల్ ఇస్మార్ట్ క్లైమాక్స్ బ‌డ్జెట్‌.. ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెడుతున్నారో తెలుసా?

సోష‌ల్ మీడియా ద్వారా నిహారిక త‌న డివోర్స్ ను అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసింది. కానీ అందుకు కార‌ణం ఏంటి అన్న‌ది మాత్రం బ‌య‌ట‌పెట్ట‌లేదు. అయితే తాజాగా నిహారిక నోరు విప్పింది. ప‌రోక్షంగా త‌న విడాకుల‌కు కార‌ణం ఏంటో కుండ బ‌ద్ద‌లు కొట్టేసింది. నిఖిల్ విజ‌యేంద్ర‌సింహా అనే యూట్య‌బ‌ర్‌కు నిహారిక ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంట‌ర్వ్యూలో ఆమె వృత్తిప‌ర‌మైన విష‌యాలే కాకుండా వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను సైతం పంచుకుంది. ఈ క్ర‌మంలోనే తొలిసారి చైత‌న్య‌తో విడిపోవ‌డంపై మాట్లాడింది. విడాకులతోనే లైఫ్ ముగిసిపోయిన‌ట్లుగా తాను భావించ‌డం లేద‌ని.. ఎదుటివారిని ఈజీగా న‌మ్మ‌కూడ‌ద‌ని పెళ్లి త‌ర్వాతే అర్థమైంద‌ని నిహారిక తెలిపింది. (Niharika Konidela)

Niharika Konidela About Her Divorce

పెళ్లి అనేది ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఎంతో ముఖ్య‌మైన‌ ఘ‌ట్టం, క‌డ వ‌ర‌కు క‌లిసి ఉంటామ‌నే న‌మ్మ‌కంతోనే ఏ జంట‌నైనా పెళ్లి చేసుకుంటారు. నేను అలాగే అనుకున్నా. కానీ నేను ఊహించిన‌ట్లు జ‌ర‌గ‌లేదు. అందుకే ఆ బంధాన్ని ముగించాల్సి వ‌చ్చిందంటూ నిహారిక చెప్పుకొచ్చింది. ఇక మ్యారేజ్ త‌ర్వాత తాను యాక్టింగ్ మానేయాలని చాలా మంది భావించారు. అసలు పెళ్ళికి, ప్రొఫెషన్ కి సంబంధం ఏంటీ..? పెళ్ళైతే నటించ కూడదా? అంటూ నిహారిక ప్ర‌శ్నించింది. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. అందుకే ఐదేళ్ల తరువాత మళ్లీ సినిమాలు చేస్తున్నాను. వర్క్ పరంగా చాలా బిజీగా ఉన్నాను అంటూ నిహారిక తెలిపింది. మొత్తానికి వివాహం అనంత‌రం యాక్టింగ్ కు దూరంగా ఉండాల‌ని అత్తింటివారు ఆంక్షలు పెట్టినందుకే గొడవలు మొదలయ్యాయని.. అందుకే విడాకులు తీసుకున్నామ‌ని నిహారిక చెప్ప‌క‌నే చెప్పేసింది.

Join WhatsApp