Niharika Konidela About On Her Second Marriage

Niharika Konidela: మెగా డాట‌ర్ నిహారిక ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో ఏం జ‌రిగిందో మ‌నంద‌రికీ తెలిసిందే. న‌టిగా పూర్తి స్థాయిలో ఎద‌గ‌క ముందే ఈ బ్యూటీ పెళ్లి పీట‌లెక్కింది. త‌న తండ్రి నాగ‌బాబు కోరిక మేర‌కు గుంటూరు ఐజి జె.ప్రభాకర్ కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో ఏడ‌డుగులు వేసింది. 2020 డిసెంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో వీరి వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. చైత‌న్య‌-నిహారిక మేడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్ అని అంతా అనుకున్నారు. కానీ, వీరి బంధం ఎక్కువ కాలం నిల‌బ‌డ‌లేదు.

Niharika Konidela About On Her Second Marriage

పెళ్లైన కొంత కాలానికే నిహారిక‌-చైత‌న్య మధ్య మనస్పర్ధలు రావడంతో 2023 మే 19న హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకులు తీసుకున్నారు. డివోర్స్ అనంత‌రం నిహారిక త‌న కెరీర్ పై ఫుల్ ఫోక‌స్ పెట్టింది. ప్ర‌స్తుతం తెలుగులో వాట్ ది ఫిష్‌, మ‌ల‌యాళంలో మద్రాస్కరన్ అనే చిత్రాలు చేస్తోంది. ఆహా వేదిక‌గా చెఫ్ మంత్ర సీజన్ 3కి హోస్ట్‌గా చేస్తోంది. అలాగే మ‌రోవైపు పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్స్ నిర్విస్తోంది.

అయితే నిహారిక ప్రజంటర్‌గా వ్య‌వ‌హ‌రించిన సాగు ఇండిపెండెంట్ సినిమా నేరుగా ఓటీటీలో విడుద‌ల కాబోతోంది. సాగు ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న నిహారిక‌.. త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి కొన్ని ఓపెన్ కామెంట్స్ చేసింది. ముఖ్యంగా రెండో పెళ్లిపై ప‌రోక్షంగా హిట్స్ ఇచ్చింది. ఈ ఇంట‌ర్వ్యూలో నిహారిక త‌న‌కు పిల్ల‌లంటే చాలా ఇష్ట‌మ‌ని తెలిపింది. దాంతో యాంక‌ర్ వెంట‌నే పెళ్లి ప్ర‌స్తావ‌న తెచ్చాడు. మళ్లీ నిహారికను పెళ్లి కూతురిగా చూడొచ్చా అని యాంక‌ర్ అడిగారు.(Niharika Konidela)

Also Read: Rachna Banerjee: బాలకృష్ణ ఊరికే కోప్పడేవారు.. నంద‌మూరి హీరోపై సీనియ‌ర్ బ్యూటీ ర‌చ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

అందుకు నిహారిక‌.. డెఫినెట్‌గా పిల్లలు కావాలని అంటున్నాను కాబట్టి పెళ్లి చేసుకోవాలి. దానికోసం అనే కాదు. లవ్ మీద నాకు నెగెటివ్ ఇంప్రెషన్ లేదు. కాబ‌ట్టి వెంట‌నే కాక‌పోయినా పెళ్లైతే కచ్చితంగా చేసుకుంటాన‌ని పేర్కొంది. ఇంకా మాట్లాడుతూ.. ఒక రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వలేదంటే ప్ర‌ధాన‌ కార‌ణం ఏంట‌ని అడుగుతారు. ఒక్క రీజన్‌తో ఎవరు విడిపోరు. చాలా రీజన్స్ ఉంటాయి. చాలా రీజన్స్ ఉన్నాయి కాబట్టి వర్కౌట్ కాలేదు. అలా అని మళ్లీ లవ్ రాద‌ని, మ‌రొక వ్య‌క్తిపై ప్రేమ కలగద‌ని అనుకోవడం మూర్ఖత్వమ‌ని తెలిపింది. మొత్తానికి ప‌రోక్షంగా ఈసారి ల‌వ్ మ్యారేజ్ చేసుకుంటాన‌ని నిహారిక హిట్ ఇచ్చింది. దీంతో ఆమె కామెంట్స్ కాస్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారాయి.

Join WhatsApp