. Nikhil Devadula Child Artist Interesting Comments

Nikhil Devadula: ప్రస్తుత కాలంలో అనేక చిత్రాలు చేతిలోకి వచ్చినట్లు వచ్చి పోతూ ఉంటున్నాయి. వీటి గురించి అనేక మంది యాక్ట్రెస్ మరియు హీరోలు బయట పెడుతూ వస్తున్నారు. సినిమా షూటింగ్ పూర్తి చేసి రెమ్యూనరేషన్ కూడా తీసుకున్నప్పటికీ సినిమాలో మాత్రం వారు కనిపించడం లేదు. ఇక తాజాగా ఇటువంటి ఘనత తనకు కూడా జరిగిందంటూ ఓ చైల్డ్ ఆర్టిస్ట్ మీడియా ముందుకి వచ్చి తన ఆవేదనను బయటపెట్టాడు. బాహుబలి సినిమాలో ప్రభాస్ చిన్నప్పటి క్యారెక్టర్ చేసిన కుర్రోడు గుర్తున్నాడా? ఈ సినిమాతో ఈ అబ్బాయికి మంచి పాపులారిటీ ఏర్పడిందని చెప్పుకోవచ్చు.

. Nikhil Devadula Child Artist Interesting Comments

ఇక ఈ చైల్డ్ ఆర్టిస్ట్ అదిరిపోయే సినిమా అవకాశాన్ని కోల్పోయినట్లు చెప్పుకొచ్చాడు. ఆ చిత్రంలో తనను తీసుకోకుండా మహేష్ బాబు కొడుకును పెట్టుకున్నట్లు వివరించాడు. బాహుబలి సినిమాలో ప్రభాస్ చిన్ననాటి రోల్ ప్లే చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు నిఖిల్ దేవాదుల. హీరోయిన్ రమ్యకృష్ణ కు తేలు కుట్టకుండా అడ్డుకొని.. కట్టప్ప చేతితో అన్నం తిన్న తన నటనతో అందరిని మిస్మరైజ్ చేశాడు. కేవలం ఈ ఒక్క సినిమాలోనే కాకుండా మరిన్ని సినిమాల్లో కూడా కనిపించాడు. బాబు బాగా బిజీ, సీత రామం వంటి చిత్రాలు చేశాడు. అయితే ఈయన జీవితంలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి వచ్చినట్లు తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు.

Also Read: Hair: పసుపుతో ఈ విధంగా చేస్తే తెల్లటి జుట్టు కూడా నల్లగా మారడం ఖాయం..!

ఇక ముఖ్యంగా తాను చదువుకుంటూనే సినిమాలు చేస్తున్నారని.. పదో తరగతిలో ఉండగా బాహుబలి సినిమా చేసినట్లు వెల్లడించాడు. కేవలం వారం రోజులు మాత్రమే తాను ఆ సినిమా షూటింగ్లో పాల్గొన్నట్లు వివరించాడు. అంతేకాకుండా మహేష్ బాబు హీరోగా చేసిన వన్ నేనొక్కడినే సినిమా కోసం కూడా తాను పని చేసినట్లు వెల్లడించాడు. ఇక సినిమాకు వారం రోజుల పాటు ఆడిషన్స్ నిర్వహించారని.. అందులో కొందరిని షార్ట్ లిస్ట్ చేశారని నిఖిల్ వెల్లడించాడు. ఇక సినిమాలో తాను సెలెక్ట్ అయ్యానని.. బట్టల కోసం కొలతలు కూడా తీసుకున్నారని వెల్లడించాడు.

. Nikhil Devadula Child Artist Interesting Comments

అయితే వారం రోజుల తర్వాత నాకు ఫోన్ చేస్తామని చెప్పి పంపించారని.. ఇంటికి వెళ్ళాక చాలా రోజుల పాటు ఫోన్ రాలేదని.. ఆ తరువాత కొంత కాలానికి ఆ సినిమాలో మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ నటించబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారట. తను ఉండాల్సిన పాత్రలో మహేష్ బాబు కొడుకు ఉండడం చూసి షాక్ అయినట్లు వెల్లడించాడు. ఇక ఆ విషయం తెలిసి కాస్త బాధ పడినట్లు కూడా చెప్పుకోవచ్చాడు. ఇక ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేసిన ఈయన పలు సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు. ప్రస్తుతం నిఖిల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Nikhil Devadula)

Join WhatsApp