Nikhil Siddhartha Shares Her Wife Baby Shower Photos

Nikhil Siddhartha: కార్తికేయ 2 మూవీతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న టాలీవుడ్ యంగ్ స్టార్‌ నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే తండ్రి కాబోతున్నాడు. ఆయ‌న స‌తీమ‌ణి పల్లవి వర్మ మ‌రి కొద్ది రోజుల్లో పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతోంది. తాజాగా ప‌ల్ల‌వి వ‌ర్మ సీమంతం వేడుక ఘ‌నంగా జ‌రిగింది. 2020 మే 14న‌ నిఖిల్‌, ప‌ల్ల‌వి వర్మ‌ల వివాహం జ‌రిగింది. వృత్తిరిత్యా ప‌ల్ల‌వి డాక్ట‌ర్. ఆమె స్వ‌స్థ‌లం భీమ‌వ‌రం. పెళ్లికి ముందు నిఖిల్‌, ప‌ల్ల‌వి వ‌ర్మ కొన్నాళ్లు ప్రేమించుకున్నారు.

Nikhil Siddhartha Shares Her Wife Baby Shower Photos

ఆ త‌ర్వాత పెద్ద‌ల అంగీకారంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. క‌రోనా కార‌ణంగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో అత్యంత సన్నిహితుల మ‌ధ్య ఈ జంట ఏడ‌డుగులు వేశారు. వివాహం అనంత‌రం నిఖిల్ మ‌రింత ఊపందుకుంది అన‌డంలో సందేహం లేదు. ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల ప‌ల్ల‌వి వ‌ర్మ గ‌ర్బం దాల్చింది. నెల‌లు నిండటంతో నిఖిల్ వాళ్ల ఇంట్లో పల్లవి వర్మకు ఘనంగా సీమంతం చేశారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలను నిఖిల్ సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఓ ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టాడు. త్వ‌ర‌లోనే మేము త‌ల్లిదండ్రులం కాబోతున్నాము. ఈ గుడ్‌న్యూస్ ను మీతో పంచుకుంటున్నందుకు నేను, ప‌ల్ల‌వి ఎంతో సంతోషంగా ఉన్నాము. మాకు పుట్టబోయే బిడ్డకు మీ అందరి ఆశీస్సులు పంపుతార‌ని ఆశిస్తున్నాము అంటూ నిఖిల్ త‌న పోస్ట్ లో పేర్కొన్నాడు. దీంతో అభిమానులు, నెటిజ‌న్లు నిఖిల్ దంప‌తుల‌కు కంగ్రాట్స్ చెబుతున్నారు.(Nikhil Siddhartha)

Also Read: Tripti Dimri: పెళ్లిపై ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేసిన యానిమల్ బ్యూటీ త్రిప్తి..!

పండంటి బిడ్డ మీకు పుట్టాలంటూ ఆశీర్వ‌దిస్తున్నారు. కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్రస్తుతం నిఖిల్ లైన‌ప్ లో స్వయంభూ, ది ఇండియా హౌజ్, చైనా పీస్ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. భ‌ర‌త్ కృష్ణ‌మాచారి డైరెక్ట్ చేస్తున్న స్వ‌యంభూ చిత్రం ఆల్మోస్ట్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. నిఖిల్ కెరీర్ లోనే హైయ్యెస్ట్ బ‌డ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న మూవీ ఇది. ఈ సినిమా కోసం నిఖిల్‌ దాదాపు మూడు నెలల పాటు యుద్ధవిద్యలపైనే శిక్ష‌ణ కూడా తీసుకున్నాడు.

Join WhatsApp