Nita Ambani younger sister is a school teacher

Nita Ambani: ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ అందరికీ సుపరిచితమైన వ్యక్తి.ఈమె భర్తతో పాటుగా బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ బిజీబిజీగా గడుపుతుంది. అంతే కాదు ఏదైనా ఫంక్షన్స్ జరిగితే చాలు నీతా అంబానీ అందులో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. 60 ఏళ్ల వయసు దాటినా కూడా చెక్కుచెదరని అందంతో పాతికేళ్ల అమ్మాయి లాగే తన ఫిట్నెస్ ని మెయింటైన్ చేస్తుంది నీతా అంబానీ. అయితే అలాంటి కోటీశ్వరులైన నీతా అంబానీ చెల్లెలు ఒక స్కూల్ టీచర్ అని మీకు తెలుసా.. ఇక నీతా అంబానీ చెల్లెలు టీచర్ అనే సంగతి చాలా మందికి తెలియదు.

Nita Ambani younger sister is a school teacher

అయితే అంత పెద్ద కోటీశ్వరులైనా నీతా అంబానీ చెల్లెలు మాత్రం ఎందుకు నెల జీతానికి స్కూల్లో పనిచేస్తుంది అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందామా… నీతా అంబానీ చెల్లెలు పేరు మమతా దలాల్. ఆమె స్కూల్లో టీచర్ గా పని చేస్తుందట. అయితే స్కూల్ అంటే ఏదో చిన్నచితికా స్కూల్ కాదు. ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్.. పెద్దపెద్ద సెలబ్రిటీలకు సంబంధించిన పిల్లల ఈ స్కూల్ లో చదువుతారు.షారుక్ ఖాన్ ,ఐశ్వర్యరాయ్ వంటి పెద్ద పెద్ద సెలబ్రిటీల పిల్లలతో పాటు ఈ స్కూల్లో ఎక్కువగా ధనవంతుల, వ్యాపారవేత్తల పిల్లలే చదువుతారు.(Nita Ambani)

Also Read: Rashmika Mandanna: ర‌ష్మిక‌కు అవంటే అంత ఇష్ట‌మా.. ఫారెన్ వెళ్తే కొన‌కుండా అస్స‌లు రాద‌ట‌!!

ఇక ప్రపంచంలోనే అత్యధిక స్కూల్ ఫీజులు వసూలు చేసే స్కూల్లలో ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఒకటి. ఇక ఫీజులు మాత్రమే కాదు టీచర్లకి జీతాలు కూడా ఈ స్కూల్లో ఎక్కువగానే ఇస్తారు. ఇక అలాంటి ఈ స్కూల్లో నీతా అంబానీ చెల్లెలు మమత దలాల్ టీచర్ గా వర్క్ చేస్తుందట. ఇక ఈమె జీతం కూడా లక్షల్లోనే ఉంటుందని తెలుస్తోంది.అయితే నీతా అంబానీ చేసే ప్రతి ఒక్క పనిలో మమతనే ఉంటుందట. తన అక్క చేసే ప్రతి పనికి మమతనే అన్నీ ముందుండి నడిపిస్తుందట.

Nita Ambani younger sister is a school teacher

అంతేకాదు అంబానీ ఫ్యామిలీలో జరిగే కొన్ని కొన్ని విషయాలు మమత నిర్ణయం అనుసరించే జరుగుతాయట. నీతా అంబానీ తన చెల్లెలకి ప్రతి విషయంలో రెస్పెక్ట్ ఇస్తుందట. ఇక అంత పెద్ద ఫ్యామిలీకి కోడలు అయినప్పటికీ కూడా నీతా అంబానీ తన చెల్లెల్ని ఎప్పటికీ తక్కువ చేసి చూడదట ప్రేమతోనే చూసుకుంటుందట. అంతేకాకుండా అంబానీ ఫ్యామిలీలో ఉన్న నగలు వేసుకోవడానికి ఖరీదైన వస్తువులు వాడుకోవడానికి మమత దలాల్ కి పూర్తి అధికారం ఉందని తెలుస్తోంది .(Nita Ambani)

Join WhatsApp