Nithiin heroine is going to marry a businessman

Nithiin: ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోయిన్లు బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పి వివాహ బంధం లోకి అడుగుపెడుతున్నారు. ఇక ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్, తాప్సి పన్ను రీసెంట్గా అపర్ణ దాస్ వంటి హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారు.ఇక ఈ ఏడాది వరలక్ష్మి శరత్ కుమార్, తమన్నా భటియా,అదితీ రావు హైదరీ వంటి హీరోయిన్లు కూడా పెళ్లికి సిద్ధంగా ఉన్నారు.

Nithiin heroine is going to marry a businessman

అయితే తాజాగా మరో హీరోయిన్ కూడా పెళ్లికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఆ హీరోయిన్ ఎవరంటే నితిన్ హీరోగా చేసిన లై,ఛల్ మోహన్ రంగా వంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసిన మేఘా ఆకాష్.. ఈ హీరోయిన్ రవితేజ హీరోగా చేసిన రావణాసుర, రాజరాజ చోర, గుర్తుందా శీతాకాలం, లై, చల్ మోహన్ రంగా వంటి టాలీవుడ్ సినిమాల్లో నటించి తెలుగులో మంచి గుర్తింపు సంపాదించింది. (Nithiin )

Also Read: Madhuri Dixit: పెళ్లికి ముందే ఆ హీరోతో డేటిం** చేసి ప్రెగ్నెన్సీ తెచ్చుకున్న మాధురి దీక్షిత్..?

అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో చేతులకు మెహేంది పెట్టుకొని అందంగా చీర కట్టుకొని ముస్తాబై వెడ్డింగ్ వైబ్ అనే యాష్ ట్యాగ్ పెట్టి పోస్ట్ షేర్ చేసింది.దీంతో మేఘా ఆకాష్ పెట్టిన పోస్ట్ చూసి చాలా మంది నెటిజన్స్ మేఘ ఆకాష్ పెళ్లి చేసుకోబోతుంది కావచ్చు అని భావించారు. అంతేకాదు పెళ్లికి ముందు ఇలా పిక్ షేర్ చేసి అభిమానులకు హింట్ ఇస్తుంది కావచ్చు అని అందరూ అనుకున్నారు.కానీ అసలు విషయం ఏంటా అని ఆరా తీయగా..

Nithiin heroine is going to marry a businessman

ఈ హీరోయిన్ రీసెంట్గా పెళ్లికి వెళ్ళిన సమయంలో అక్కడ ఫోటోషూట్ చేయించుకుందట. ఆ సమయంలో దిగిన ఫొటోస్ ని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిందట. ఇక అసలు విషయం ఇదైతే మరో గుడ్ న్యూస్ కూడా ఉంది. అదేంటంటే..ఈ హీరోయిన్ కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందట. మేఘా ఆకాష్ ముంబైకి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ ని పెళ్లాడబోతున్నట్టు సమాచారం. ఇక త్వరలోనే మేఘా ఆకాష్ కూడా తన పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ ని అందరితో షేర్ చేసుకోబోతున్నట్లు సమాచారం.(Nithiin )

Join WhatsApp