Devara

Devara Part – 1: ఎన్టీఆర్ హీరో గా నటిస్తున్న దేవర సినిమా భారీ బడ్జెట్ తో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ కథానాయిక జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ను ముందుగా ఏప్రిల్ 5 న విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆ తేదీ నుంచి తప్పుకుంది. గ్రాఫిక్స్ పనులు పూర్తి కాకపోవడడం వల్లనే సినిమా వాయిదా పడిందని అంటున్నారు.

NTR Devara Part – 1 Movie Again Postponed

ఇకపోతే ఈ సినిమా పోస్ట్ పోన్ చేయడానికి కారణం ఏపీ లో ఎన్నికలు అని అనేవాళ్ళు లేకపోలేదు. ఎదేటైనా దేవర ఏప్రిల్ 5 న రావడం లేదన్నది మాత్రం దాదాపుగా ఖరారైపోయింది. ఆ తేదీ లో తన సినిమా ను రిలీజ్ చేయడానికి విజయ్ దేవరకొండ ప్రయత్నిస్తున్నాడు. సంక్రాంతి కి రావాల్సిన ఫ్యామిలీ స్టార్ సినిమా ను ఏప్రిల్ 5 న విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఫైనల్ గా దేవర సినిమా ను ఆగస్ట్ 15 న విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. (Devara)

Also Read: Prashant Kishor: మళ్లీ వచ్చేది మోడీ ప్రభుత్వమే..బీజేపీకి ఎన్ని సీట్లు అంటే ?

అప్పటికి సినిమా పనులు పూర్తవుతాయని చిత్ర బృందం కాన్ఫిడెంట్ గా ఉండడంతో ఈ వార్తలు వస్తున్నాయి. ఆ టైం లో అల్లు అర్జున్ పుష్ప 2 రావడం కష్టంగా మారడంతో ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకోగా, ఇప్పుడు కూడా ఎన్టీఆర్ సినిమా రావడం కష్టమేననే వార్తలు ఇప్పడు ఇండస్ట్రీ లో వినిపిస్తున్నాయి.

దాంతో ఆ తేదీని లాక్ చేసుకోవడానికి నాని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవలే హాయ్ నాన్నలాంటి ఫీల్ గుడ్ మూవీ చేసిన నాని ఆ తర్వాత సరిపోదా శనివారం అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ను వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే శేరావేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం మంచి డేట్ కోసం చూస్తుండగా ఆగస్ట్ 15 న పరిశీలిస్తున్నారు. అన్ని కుదురుతే ఆ తేదీనే ఈ సినిమా రావచ్చు.

Join WhatsApp