Padma Vibhushan Chiranjeevi Shines At New York Times Square

Chiranjeevi: ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకమైన ప‌ద్మ‌ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశ‌వ్యాప్తంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన ప్రముఖులకు పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డుల‌ను అనౌన్స్ చేశారు. అయితే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని ప‌ద్మ విభూష‌ణ్ వ‌రించింది. దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం ద‌క్క‌డంతో చిరంజీవికి సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

Padma Vibhushan Chiranjeevi Shines At New York Times Square

గ‌త నాలుగు రోజుల నుంచి సోష‌ల్ మీడియాలో చిరంజీవి పేరు మారుమోగిపోయింది. అభిమానులు, సామాన్యులు కూడా చిరంజీవిని విష్ చేస్తున్నారు. అలాగే సినిమా రంగంతో పాటు సామాజిక సేవలో చిరంజీవి ఇన్నాళ్లు అందించిన సేవ‌ల‌ను గుర్తు చేసుకుంటూ ఆయ‌న్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇదే త‌రుణంలో చిరంజీవికి ఓ అభిమాని లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చారు.

న్యూయార్క్ కి చెందిన కుందవరపు శ్రీనివాస్ నాయుడు అనే ఎన్నారై మెగాస్టార్ కు ఎవ‌రూ ఊహించ‌ని విధంగా శుభాకాంక్ష‌లు తెలిపాడు. ఏకంగా అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్న టైమ్స్ స్క్వేర్ స్క్రీన్ పై చిరంజీవి విజువల్స్ ను ప్రదర్శనకు పెట్టాడు. దేశ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ ను సాధించిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారికి అభినంద‌న‌లు అంటూ విజువల్స్ పై పేర్కొన్నాడు.(Chiranjeevi)

Also Read: Varalaxmi Sarathkumar: ఎట్ట‌కేల‌కు పెళ్లికి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ గ్రీన్ సిగ్న‌ల్‌.. ఆ స్టార్ హీరోతో ఏడ‌డుగులు!?

ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి. ఇప్ప‌టి వ‌ర‌కు చిరంజీవికి ఎన్నో గిఫ్ట్స్‌, విషెస్ వ‌చ్చాయి. కానీ, కుంద‌వ‌ర‌పు శ్రీ‌నివాస్ నాయుడు ఇచ్చిన గిఫ్ట్ మాత్రం చిరంజీవికి నిజంగా స్పెష‌లే అన‌డంలో సందేహం లేదు. కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. చిరంజీవి ప్ర‌స్తుతం విశ్వంభ‌ర మూవీతో బిజీగా ఉన్నారు. బింబిసార ఫేమ్ వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఆల్రెడీ విశ్వంభ‌ర షూటింగ్ ప్రారంభం అయింది.

Join WhatsApp