Pallavi Prashanth who kept his word

Pallavi Prashanth: ఎటువంటి సినిమా ఫీల్డ్ టచ్ లేకుండా సరైన అవగాహన కూడా లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి మేర పాపులారిటీ సంపాదించుకున్నాడు పల్లవి ప్రశాంత్. నేనొక రైతు బిడ్డని నన్ను గెలిపించండి అంటూ రిక్వెస్ట్ చేస్తూ వీడియోలు చేసుకుంటూ బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాడు. అంతే కాదండోయ్.. హౌస్ లో నుంచి కప్పు కూడా కొట్టుకొచ్చాడు.

Pallavi Prashanth who kept his word

తనని గెలిపిస్తే తనకి వచ్చిన ప్రైజ్ మనీ మొత్తం రైతులు మరియు అనాధలకి పెడతానని మాట కూడా ఇచ్చాడు. ఇక ఈ మాటలకి కరిగిపోయిన జనాలు ఈయనకి గుడ్డుగా ఓట్లు వేయడం మొదలుపెట్టారు. ఉల్టా పుల్టా షోలో పాల్గొని ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. ఇక బయటకి వచ్చిన అనంతరం ప్రశాంత్ పై అనేక వార్తలు మరియు అనేక కేసులు కూడా నమోదయ్యాయి. అలా గెలిచాడని ఆనందం లేకుండా పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈయన అభిమానులు మొత్తం కృంగిపోయారు. ఆర్టీసీ బస్సులు మరియు ఇతర వాహనాలను తగలబెట్టడమే ఇందుకు కారణం.

Also Read: Junior NTR: తన కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్లు అందించిన డైరెక్టర్లు ఉన్నప్పటికీ.. ఆ ఫ్లాప్ డైరెక్టర్ కి ఫ్యాన్ అయిన తారక్..!

తన ఫ్యాన్స్ చేసిన తప్పుకి పల్లవి ప్రశాంత్ బలైపోయాడు. ఇక ఇటీవల బెయిల్ పై బయటికి వచ్చాడు. అదేవిధంగా ప్రస్తుతం అనేక టీవీ షోస్ లో కూడా పాల్గొంటున్నాడు. ఇక తాజాగా తనకి వచ్చిన ప్రైజ్ మనీతో కొందరికి సాయం చేశాడు. అంతేకాకుండా తనకి వచ్చిన ప్రైజ్ మనీ ఎంతోమందికి సరిపోవడంలేదని నన్ను సీఎం చేపిస్తే నేను ప్రతి ఒక్క ఊరిని కాపాడతానని మరో డ్రామా కూడా మొదలుపెట్టాడు. నన్ను సీఎం చేపించండి అందరిని కాపాడుకుంటూ వస్తా.. అంటూ ఓ కొత్త స్క్రిప్ట్ ని ప్లే చేశాడు.

Pallavi Prashanth who kept his word

ఇక దీనికి కొందరు పడిపోయారు కూడా. నిజానికి సీఎం అవ్వాలంటే సరైన సత్తా మరియు డబ్బు.. పేరు ప్రఖ్యాతలు ఉండాలి. అవేవీ లేకుండా నేను ఒక రైతు బిడ్డని నేను సీఎం అయిపోతా అనడం లో ఏమి ఉపయోగం లేదు. ఇక ఇటీవలే తన తల్లిదండ్రులు కోల్పోయిన ముగ్గురు పిల్లలకి 50,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు పల్లవి ప్రశాంత్. ప్రస్తుతానికి అయితే తాను ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాడు. మరి రానున్న రోజుల్లో ఈయన పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తాడో లేదో చూడాలి.(Pallavi Prashanth)

Join WhatsApp