Pawan Kalyan's Unexpected Turn

Pawan Kalyan: స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. జల్సా, తొలిప్రేమ వంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన పవన్ కళ్యాణ్ కి ఏ రేంజ్ పాపులారిటీ ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన పవన్ తన ఫ్యాన్స్ ని ఆకట్టుకోలేకపోయాడు. ఇక సాధారణంగా హీరోల సినిమాలు ఏదైనా ఒకటి ఫ్లాప్ అయితే డైరెక్టర్లు వాళ్లతో సినిమా తీయాలంటే కొంతకాలం భయపడతారు.

Pawan Kalyan’s Unexpected Turn

కానీ పవన్ విషయంలో మాత్రం అది అస్సలు రిపీట్ అవ్వదు. అలా బ్రో సినిమా ఫ్లాప్ అయిందో లేదో ఇలా వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం పవన్ లైన్ అప్ లో ఉన్న సినిమాలలో ఊస్తాద్ భగత్ సింగ్, ఓజీ, గ్యాంగ్ స్టార్ వంటి సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలపై పవన్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక వీటిలో ఏ ఒక్క సినిమా హిట్ అయిన పవన్ కి మరో 10 ఏళ్ల పాటు సినీ కెరీర్ ఉంటుందని చెప్పొచ్చు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Nandamuri Chaitanya: మన‌ టాలీవుడ్ లో ఏ స్టార్ హీరో కూడా క్రియేట్ చేయలేని రికార్డుని క్రియేట్ చేసిన నందమూరి చైతన్య ..!

పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేద్దామని అనుకున్నారట. కానీ ఆయన కుటుంబం ఒప్పుకోకపోవడంతో న్యూయార్క్ యూనివర్సిటీలో ఓ అసిస్టెంట్ కోర్స్ ఉన్నాయి.. ఇక దానికి అప్లై చేస్తే కచ్చితంగా డైరెక్టర్ అవ్వచ్చని అప్లై చేశారట పవన్ కళ్యాణ్. ఇక అక్కడ నుంచి ఈయనకి ఓ షార్ట్ ఫిలిం తీసి పంపించమని కౌరు వచ్చిందట. ఇక ఓ చూపులేని వాడి ప్రపంచం ఎలా ఉంటుంది అనే దానిపై షార్ట్ ఫిలిం తీసి పంపించారు పవన్ కళ్యాణ్. ఇక అది చూసి న్యూయార్క్ ఫిలిం సిటీ నుంచి పవన్ కళ్యాణ్ కి సెలెక్ట్ అయినట్లు పోస్ట్ కూడా వచ్చిందట.

Pawan Kalyan's Unexpected Turn

కాకపోతే ఫీజు ఎక్కువ ఉండడం వల్ల తన అన్నయ్యకు తను భారం కాకూడదని ఈ అవకాశాన్ని వదులుకున్నాడట పవన్ కళ్యాణ్. ఇక అనంతరం యాక్టింగ్ నేర్చుకుని స్టార్ అయ్యారు. ప్రస్తుతం ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. అదేవిధంగా పాలిటిక్స్ లో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు. అయినప్పటికీ అప్పట్లోనే ఓ బ్లైండ్ పర్సన్ లైఫ్ గురించి చూపించాలని అనుకున్నారు అంటే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో అక్కడే అర్థమయిపోయింది.ఇక ఈ విషయం తెలుసుకున్న కొందరు ఆశ్చర్యపోతున్నారు.(Pawan Kalyan)

Join WhatsApp