Pawan Kalyan rejected the blockbuster movie

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుండుకు భయపడి ఆ బ్లాక్ బస్టర్ మూవీ రిజెక్ట్ చేశారా.. ఒకవేళ ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ చేసి ఉంటే కనుక ఆయన రేంజ్ ఎక్కడో ఉండేదట.కానీ ఆయన సినిమాకు భయపడే రిజెక్ట్ చేశారట. మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమా ఏంటో తెలుసుకుందామా.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రీమేక్ సినిమాల్లో నటించారు. అయితే అలాంటిదే ఒకటి గజిని మూవీ..

Pawan Kalyan rejected the blockbuster movie

గజినీ రీమేక్ చేద్దామని కొంతమంది ప్రొడ్యూసర్స్ తన దగ్గరికి వచ్చారట.కానీ ఈ సినిమాలో హీరో గుండు తీసుకోవడం, మతిమరుపు క్యారెక్టర్లో నటించడం తన వల్ల కాదని ఒకవేళ తనని ఆ పాత్రలో చూస్తే ప్రేక్షకులు అస్సలు ఒప్పుకోరని భయపడి తనకు తానే ఊహించుకొని పవన్ కళ్యాణ్ ఈ సినిమాని రిజెక్ట్ చేశారట. అయితే పవన్ కళ్యాణ్ ఎన్నో రీమేక్ సినిమాల్లో నటించిప్పటికి తననిఆ సినిమాలో జనాలు ఆదరిస్తారో లేదో అనే భయం తనలో ఉండేదట. (Pawan Kalyan )

Also Read: Samantha: బర్త్డే రోజు బయటపడ్డ సమంత రహస్య ప్రేమికుడు.. చైన్ మెడలో వేసి ప్రపోజ్..!

అయితే తమిళ వాళ్ళు ప్రతి ఒక్క పాత్రలో నటిస్తారని,డీ గ్లామరస్ అలాగే ఎలాంటి పాత్రలో అయినా లీనమైపోతారు. కానీ అలాంటి పాత్రల్లో మన తెలుగు హీరోలు నటిస్తే ఆడియన్స్ అస్సలు ఎంకరేజ్ చేయరు. టాలీవుడ్ లో హీరో అంటే అందంగా ఉండాలి బాడీ ఉండాలి అని చూస్తారు.అందుకే నేను గజినీ సినిమాను రీమేక్ చేయడం కంటే డబ్ చేయడమే మంచిది అని చెప్పాను.

Pawan Kalyan rejected the blockbuster movie

ఈ సినిమాలో సూర్య నటన చూసి ముందుగా భయపడి పోయానని,ఆయన పాత్రలో ఒదిగిపోయి నటించారు అంటూ పవన్ కళ్యాణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది.అయితే పవన్ కళ్యాణ్ గజిని రీమేక్ మూవీ కాకుండా ఎన్నో రీమేక్ సినిమాలను ఇలాంటి భయాల కారణంగానే నటించలేదట. అలా గజినీ మూవీని చేతులారా మిస్ చేసుకున్నారట పవన్ కళ్యాణ్.(Pawan Kalyan )

Join WhatsApp