Politics in Allu Arjun Pushpa 2

Allu Arjun: అల్లు అర్జున్.‌.. ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన టాలెంట్ను టాలీవుడ్ కి చాటి చెప్పి ప్రస్తుతం స్టార్ హీరోలలో ఒకరిగా నిలిచాడు బన్నీ. మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చి మంచి గుర్తింపును సంపాదించుకున్న వారులో అల్లు అర్జున్ ఒకరు. గతంలో అల్లు అర్జున్ నటించిన ఆర్య వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఏ విధమైన కలెక్షన్స్ రాబట్టయో మనందరికీ తెలిసిందే. ఇక ఆ సినిమాలన్నీ కూడా ఓ ఎత్తు అయితే పుష్ప సినిమా మాత్రం అల్లు అర్జున్ కెరీర్ లో మరొక ఎత్తు. కేవలం ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా హీరో అవ్వడమే కాకుండా నేషనల్ అవార్డు సైతం సొంతం చేసుకున్నాడు బన్నీ.

Politics in Allu Arjun Pushpa 2

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో అల్లు అర్జున్ కి జోడిగా రష్మిక మందన హీరోయిన్గా నటించింది. ఈ మూవీ 2021 డిసెంబర్ 17వ తారీఖున ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఈ ఒక్క సినిమాతో బన్నీ ఇతర దేశాల్లో కూడా స్టార్ గా నిలిచాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ కి టాలీవుడ్ లోనే కాదు ఇతర భాషల్లో కూడా ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇక ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ చేసి సమంత కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఎంతోమంది దిశను మార్చిన ఈ సినిమాకి సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే.

Also Read: AsaralaSrinivas: నేను రాశి కన్నా తో అటువంటి పని చేశాను.. అవసరాల శ్రీనివాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

పుష్ప సినిమాకి సీక్వెల్ గా పుష్ప ది రూల్ అనే క్యాప్షన్ తో రాబోతుంది. ఈ మూవీలో కూడా రష్మిక మందన తన యాక్టింగ్ తో ఇరగదీసేలాగానే కనిపిస్తుంది. ఇటీవల బన్నీ బర్తడే సందర్భంగా ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక నిన్న అనగా మే ఒకటవ తారీఖున ఈ మూవీ ఒక ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ లో అల్లు అర్జున్ గెటప్ అండ్ స్టైల్ వేరే లెవల్ అని చెప్పుకోవచ్చు. పుష్ప పుష్ప పుష్ప అనే సాగే ఈ లిరిక్స్ బన్నీ ఫాన్స్ ని బీభత్సంగా ఆకట్టుకున్నాయి.

Politics in Allu Arjun Pushpa 2

మొదట ఒక ఫ్లైట్ లో నుంచి బన్నీ దిగుతూ జనసేన గుర్తు అయిన గాజు గ్లాస్ ను పట్టుకుని రెండు స్టెప్పులు వేశాడు. దీంతో బన్నీ సినిమాలో పాలిటిక్స్ కనిపిస్తున్నాయంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప రాజ్ జనసేన కి సపోర్ట్ చేస్తూ ఈ విధమైన హిట్ ఇచ్చాడంటూ పలువురు ట్రోల్స్ చేస్తున్నారు కూడా. గాజు గ్లాస్ తో బన్నీ వేసిన స్టెప్పులు కి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. ప్రస్తుతం మన ఏపీలో పాలిటిక్స్ హడావిడి ఏ విధంగా ఉందో చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో ఏ చిన్న సినిమాలో ఏ హింటు దొరికిన ప్రతి ఒక్కరు దానిని ట్రోల్స్ కింద చేసేస్తున్నారు. అలా తయారయింది సాంగ్ రూమర్ కూడా.(Allu Arjun)

Join WhatsApp