Pooja Hegde Marraige

Pooja Hegde: టాలీవుడ్ బుట్ట బొమ్మ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది కేవలం పూజ హెగ్డే మాత్రమే.. ఈమె అల వైకుంఠపురం సినిమాలో బుట్ట బొమ్మా బుట్ట బొమ్మా అనే సాంగ్ తో టాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఒకరకంగా చెప్పుకోవాలంటే ఈమె డ్యాన్స్ చేసిన పాటకి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది చిందులు వేశారు. ఇక ఈ సినిమాలో ఉన్న బుట్ట బొమ్మ స్టెప్ ని ఇప్పటికి కూడా చాలామంది ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ఉంటారు.అయితే అలాంటి టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే ఈ మధ్యనే ఒక ఖరీదైన ఫ్లాట్ ని ముంబైలో కొనుగోలు చేసిన సంగతి మనకు తెలిసిందే.

Pooja Hegde Marraige

దాదాపు 45 కోట్ల విలువ చేసే ఫ్లాట్ ని ముంబై లోని బాంద్రా లో కొనుగోలు చేసింది. అయితే ఇప్పటికే ముంబైలో ఫ్లాట్ ఉన్నప్పటికీ మళ్లీ మరొక ఫ్లాట్ కొనుక్కోవడానికి ప్రధాన కారణం పూజ హెగ్డే త్వరలో పెళ్లి చేసుకోవడమే అని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు ఈ మధ్యకాలంలో పూజ హెగ్డే సినిమాల్లో జోరు తగ్గించి బాయ్ ఫ్రెండ్ తో తిరగడం మొదలుపెట్టిందని అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే గత కొద్దిరోజులుగా పూజ హెగ్డే తన బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతున్న ఫోటోలు మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.(Pooja Hegde)

Also Read: Prabhas: ప్రభాస్ తో రొమా** చేసిన ఆ హీరోయిన్ ప్రభాస్ కి సిస్టరా.. షాకింగ్ సీక్రెట్ బయటపెట్టిన ప్రభాస్ తల్లి..!

దాంతో పూజ హెగ్డే నిజంగానే పెళ్లి పీటలెక్కబోతుందని అందరూ భావిస్తున్నారు.ఇక ఈ వార్త నిజమయ్యేలా తాజాగా పూజ హెగ్డే తన తల్లిదండ్రులతో పాటు తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ తో కూడా కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో ఒకటి చక్కర్లు కొడుతుంది.దీంతో పూజ హెగ్డే నిజంగానే ఆయనతో రిలేషన్ లో ఉంది అని అందరూ భావిస్తున్నారు. ఇక పూజ హెగ్డే బాయ్ ఫ్రెండ్ అంటూ వార్తలు వచ్చేవి ఎవరి మీదనో కాదు హిందీ బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ అయిన రోహన్ మెహ్రా.. గత కొద్ది రోజులుగా పూజ హెగ్డే ఏ ఫంక్షన్ కి వెళ్ళినా కూడా ఆమెతో రోహన్ మెహ్రా కనిపిస్తున్నారు.

Pooja Hegde Marraige

అంతేకాకుండా రీసెంట్గా తన ఫ్యామిలీతో కలిసి ఓ రెస్టారెంట్ కి వెళ్ళింది. ఇక ఈ రెస్టారెంట్లో కూడా పూజ హెగ్డే ఫ్యామిలీతో రోహన్ మెహ్రా కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి మీడియాలో చక్కర్లు కొట్టడంతో రోహన్ మెహ్రాతో పూజ హెగ్డే నిజంగానే డేటిం చేస్తుందని అందరూ భావిస్తున్నారు. అంతేకాకుండా వీరి ప్రేమకి ఇంట్లో వాళ్ళు కూడా ఓకే చేయడంతో రోహన్ మెహ్రా పూజ హెగ్డే ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్ కి వచ్చారని భావిస్తున్నారు.మరి నిజంగానే పూజా హెగ్డే రోహన్ తో డేటిం లో ఉందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.(Pooja Hegde)

Join WhatsApp