Poonam kaur's comments on Balakrishna Chinnalludu

Poonam kaur: నందమూరి నటసింహం బాలకృష్ణ ఒక పక్క సినిమాలతో పాటు మరోపక్క రాజకీయాల్లో కూడా బిజీబిజీ లైఫ్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆయన ఇద్దరు అల్లుళ్ళు కూడా పాలిటిక్స్ లోనే రాణిస్తున్నారు. పెద్దల్లుడు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తూ జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలలో మంగళూరు నుంచి కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

Poonam kaur’s comments on Balakrishna Chinnalludu

ఇక రెండో అల్లుడు శ్రీ భరత్ కూడా విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా రెండోసారి బరిలోకి దిగనున్నారు. నిజానికి గీతం సంస్థల అధినేత ఎం ఎం వి ఎస్ మూర్తి మనవడిగా ఆయనకు మంచి పేరు ఉంది. కానీ 2019 ఎన్నికలలో అప్పటి వైసిపి ఎంపీ అభ్యర్థి ఎం వివి నారాయణ చేతిలో ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ మరోసారి ఆయన లాక్ పరీక్షించుకోవడానికి మరోసారి బరిలోకి దిగారు.

Also Read: Sabja Seeds: సమ్మర్ లో సబ్జా గింజలు చేసే ఉపయోగాలు ఏంటో తెలుసా..!

కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా ఈయన పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేపట్టారు. సరిగ్గా ఇలాంటి తరుణంలో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ హీరోయిన్ పూనమ్ కౌర్ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సినోరియో చూస్తుంటే బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ ఏదో సాధించే లాగానే కనిపిస్తున్నాడని ఆమె ట్వీట్ చేసింది.

Poonam kaur's comments on Balakrishna Chinnalludu

విశాఖపట్నం నుంచి అతను గెలిచి పార్లమెంటుకు వెళితే అది చాలా అద్ఖుతంగా ఉంటుందని ఆమె పేరుకుంది. ఎడ్యుకేషన్ గురించి భవిష్యత్తు గురించి అతనికి ఉన్న విజన్ కేవలం ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం అవ్వకూడదు అన్నట్లుగా ఆమె ట్వీట్లో పేర్కొంది. తాను భరత్ ను సపోర్ట్ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఎవరు డబ్బు ఇచ్చిన తర్వాత పెట్టిన ట్వీట్ కాదు.. అలాగే స్పాన్సర్ చేసిన ట్వీట్ కాదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ మట్వీట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.(Poonam kaur)

Join WhatsApp