Poorna Relation With that Director Even After Marriage

Poorna: అవును, అవును 2, లడ్డు బాబు, జయమ్ము నిశ్చయమ్మురా,అదిగో, సీమటపాకాయ్,సిల్లీ ఫెలోస్ వంటి సినిమాలతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పూర్ణ ఎక్కువగా హారర్ మూవీస్ తోనే గుర్తింపు తెచ్చుకుంది రవిబాబు దర్శకత్వంలో వచ్చిన హారర్ మూవీస్ ఈమెకు మంచి సినీ కెరీర్ని ఇచ్చాయని చెప్పుకోవచ్చు. అయితే అలాంటి పూర్ణకి పెళ్ళై ఓ కొడుకు పుట్టాక కూడా ఆ తమిళ డైరెక్టర్ తో ఎఫై* పెట్టుకుంది అంటూ తాజాగా స్టేజ్ మీద ఆ డైరెక్టర్ ఓపెనప్ అయ్యారు. మరి ఇంతకీ పూర్ణ నిజంగానే ఆ డైరెక్టర్ తో ఎఫై* పెట్టుకుందా.. పూర్ణ ఎందుకు స్టేజ్ మీద ఏడ్చింది..మరి ఆ డైరెక్టర్ ఎందుకు స్టేజిపై ఈ విషయాన్ని బయట పెట్టారు అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.

Poorna Relation With that Director Even After Marriage

పూర్ణ పెళ్లయి ఓ కొడుకు పుట్టాక కూడా కొన్ని బుల్లెతెర షోలకు జడ్జిగా అలాగే తెలుగు,తమిళ సినిమాల్లో కీలకపాత్రల్లో చేస్తున్న సంగతి తెలిసిందే.అలా దసరా, గుంటూరు కారం,అఖండ వంటి సినిమాల్లో చేసింది.అయితే ఈమె తాజాగా తమిళంలో డెవిల్ అనే మూవీలో చేస్తోందట.ఈ సినిమాకి దర్శకుడుగా నటుడు.. డైరెక్టర్.. అయినటువంటి మిష్కిన్ సోదరుడు ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు.. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 2న విడుదల కాబోతున్న నేపథ్యంలో డెవిల్ మూవీకి సంబంధించి చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్ లో ఓ ప్రెస్ మీట్ పెట్టారు డెవిల్ మూవీ యూనిట్. ఇక ఈ ప్రెస్ మీట్ లో డెవిల్ మూవీ డైరెక్టర్ ఆదిత్య మాట్లాడుతూ..నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం.

Also Read: Star Hero: టాలీవుడ్ కి టాప్ దర్శకులని పరిచయం చేసిన ఘనత ని సొంతం చేసుకున్న ఆ స్టార్ హీరో..!

అందుకే నా సోదరుడు గురువు అయినటువంటి మిష్కిన్ దగ్గర సినిమాకి సంబంధించిన మెలకువలు నేర్చుకున్నాను అని చెప్పారు. ఇక ఈ ఈవెంట్లో డెవిల్ మూవీ కి మ్యూజిక్ డైరెక్టర్ గా చేసిన డైరెక్టర్ నటుడు అయినటువంటి మిష్కిన్ మాట్లాడుతూ..ఈ సినిమా నా తమ్ముడు తీస్తున్నాడు కాబట్టి నేను వాడికి ఫుల్ సపోర్ట్ ఇచ్చానని అందరూ భావిస్తున్నారు. అలా చెప్పుకోవడం చాలా బాధేస్తుంది. అలాగే ఈ మూవీలో చేసిన పూర్ణ కి నాకు ఏదో ఎఫై ఉంది అని ప్రచారం చేయడం నాకు ఏమాత్రం నచ్చడం లేదు.

Poorna Relation with that director even after marriage

వాస్తవానికి పూర్ణ నాకు తల్లి లాంటిది. నాకు మరో జన్మ అంటూ ఉంటే కచ్చితంగా నేను పూర్ణ కడుపులో పుట్టాలని కోరుకుంటున్నాను అంటూ దర్శకుడు మిష్కిన్ స్టేజ్ మీద ఎమోషనల్ మాటలు మాట్లాడడంతో ఈ మాటలు విన్న పూర్ణ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది.ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. అంతే కాదు గత కొద్ది రోజులుగా కోలీవుడ్ మీడియాలో డైరెక్టర్ మిష్కిన్ కి పూర్ణ కి మధ్య ఏదో ఎఫై ఉంది అంటూ వస్తున్న వార్తలకు ఈ ఒక్క వీడియోతో ఫులిస్టాప్ పడ్డట్లైంది.(Poorna)

Join WhatsApp