Popular hero who asked the worst question to Raashii Khanna

Raashii Khanna: రాశీ ఖ‌న్నా.. ఈ బ్యూటీఫుల్ హీరోయిన్ ప్ర‌స్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ స‌త్తా చాటుతున్న సంగ‌తి తెలిసిందే. త‌న అందం, న‌ట‌నా అభిన‌యంతో మొద‌ట టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న రాశీ ఖ‌న్నా.. ఆ త‌ర్వాత కోలీవుడ్ లోకి అడుగు పెట్టి స‌క్సెస్ అయింది. ఇటీవల ఫర్జీ అనే వెబ్ సిరీసుతో అటు నార్త్ ప్రేక్ష‌కుల‌కు కూడా చేరువైంది. రాజ్ అండ్ డీకే తీసిన ఈ వెబ్ సిరీస్ నేష‌న‌ల్ వైడ్ గా అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది.

Popular hero who asked the worst question to Raashii Khanna

ప్ర‌స్తుతం రాశీ ఖ‌న్నా ఓవైపు సినిమాలు, మ‌రోవైపు వెబ్ సిరీస్‌ల‌లో న‌టిస్తూ కెరీర్ ను ప‌రుగులు పెట్టిస్తోంది. అలాగే ఇంకోవైపు సోష‌ల్ మీడియాలోనూ ఎప్పుటిక‌ప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్ల‌తో కుర్ర‌కారు గుండెల్లో మంట‌లు రేపుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా రాశీ ఖ‌న్నా తాజాగా త‌న ఫ్యాన్స్ తో ముచ్చ‌ట్లు పెట్టింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆస్క్ మీ సెషన్ నిర్వహించింది.

Popular hero who asked the worst question to Raashii Khanna

ఈ సెష‌న్ లో అభిమానులు, నెటిజ‌న్లు అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు రాశీ ఖ‌న్నా చాలా ఓపిగ్గా స‌మాధాలు ఇచ్చింది. ఒక అభిమాని ఫ్యూచ‌ర్ లో ఏ హీరోతో నటించాలని ఉంది? అని ప్ర‌శ్నించ‌గా.. రాశీ ఖ‌న్నా అల్లు అర్జున్, మహేశ్ బాబు, దళపతి విజయ్, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ అంటూ దాదాపు అన్ని భాష‌ల టాప్ హీరోల పేర్లు చెప్పొచ్చింది. అలాగే మ‌రొక ఫ్యాన్ సాంగ్ పాడ‌మ‌న‌గా.. వెంట‌నే త‌న మ‌ధుర‌మైన గొంతుతో ఓ పాట‌ను పాడి అత‌ని కోరిక నెర‌వేర్చింది. (Raashii Khanna)

Also Read: Devara: తారక్ ” దేవర ” మూవీ స్టోరీ లీక్.. టెన్షన్ లో ఎన్టీఆర్ అభిమానులు..!

ఇక ఇదే సెష‌న్ లో 12th ఫెయిల్ సినిమా ద్వారా ఇటీవ‌ల సూప‌ర్ పాపుల‌ర్ అయిన హీరో విక్రాంత్ మాస్సే.. రాశీ ఖ‌న్నాను అడ‌గ‌కూడ‌ని ప్ర‌శ్న అడిగారు. చివరిగా ఎప్పుడు స్నానం చేశావ్..? అని ప్ర‌శ్నించాడు. ఆ ప్ర‌శ్న‌కు రాశీ ఖ‌న్నా ఒక క్ష‌ణం షాకైపోయింది. అయితే ప్ర‌శ్న దాటివేయ‌కుండా పొద్దున్నే స్నానం చేశా. మళ్లీ సాయంత్రం కూడా చేస్తాను అంటూ ఫ‌న్నీగా జ‌వాబు ఇచ్చింది. విక్రాంత్ మెస్సీతో రాశీ ఖన్నా రెండు ప్రాజెక్ట్స్ చేస్తుందట. ఆమెతో ఉన్న స‌న్నిహిత్యంగానే విక్రాంత్ అటువంటి ప్ర‌శ్న వేశాడు. కానీ, ఫ్యాన్స్ మాత్రం అత‌ని తీరును త‌ప్పుబ‌డుతున్నారు. సోష‌ల్ మీడియాలో ఒక హీరోయిన్ ను స్నానం గురించి అడ‌గ‌డం క‌రెక్ట్ కాద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Join WhatsApp