Popular YouTuber Shanmukh Jaswanth Arrested By Hyderabad Police In Drugs Case

Shanmukh Jaswanth: ప్ర‌ముఖ స్టార్ యూట్యూబ‌ర్‌, బిగ్ బాస్ ఫేమ్ ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ అరెస్ట్ అయ్యాడు. హైద‌రాబాద్ పోలీసులు డ్ర‌గ్స్ కేసులో అత‌న్ని అదుపులోకి తీసుకున్నాడు. ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే.. ఓ కేసులో ష‌ణ్ముఖ్ అన్న సంప‌త్ విన‌య్ కోసం పోలీసులు వెళ్లారు. కానీ అనుకోకుండా అన్న‌ద‌మ్ములిద్ద‌రూ గంజాయి తో రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుబ‌డ్డారు. పూర్తి వివ‌రాలోకి వెళ్తే.. షణ్ముఖ్‌ జస్వంత్ సోదరుడు సంపత్ వినయ్ ఏపీకి చెందిన ఒక యువతితో దాదాపు 10 ఏళ్ళ నుంచి ప్రేమాయణం సాగిస్తున్నాడు.

Shanmukh Jaswanth Arrested By Police In Drugs Case

మూడేళ్ల క్రితం ఆమెతో నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. పెళ్లి చేసుకుందామ‌నే స‌రికి ఆమెను దూరం పెట్టడం ప్రారంభించాడు. ఇక ఇర‌వై రోజుల క్రితం సంప‌త్ వేరే యువతని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు హైదరాబాద్ నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. త‌న‌ను ప్రేమ పేరుతో సంపత్ వినయ్ మోసం చేశాడంటూ ఫిర్యాదు చేసింది.

ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సంపత్ ను అరెస్టు చేసేందుకు బ‌య‌లుదేరారు. హైదరాబాద్‌లోని తమ్ముడు షణ్ముక్ ఫ్లాట్‌లో ఉన్నాడని తెలుసుకొని పోలీసులు అక్కడకు వెళ్లారు. కానీ, పోలీసులు వెళ్లే స‌మ‌యానికే సంప‌త్ అక్క‌డ నుంచి ప‌రార్ అయ్యాడు. అయితే పోలీసులు షణ్ముక్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తుండ‌గా.. డ్రగ్స్‌తో పాటు గంజాయి ప‌ట్టుబ‌డింది.(Shanmukh Jaswanth)

Also Read: Nikhil: ఫాద‌ర్ గా ప్ర‌మోట్ అయిన హీరో నిఖిల్‌.. పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన ప‌ల్ల‌వి!

అన్నను పట్టుకోవడం కోసం వెళితే పోలీసులకు ఊహించని విధంగా షణ్ముఖ్ డ్ర‌గ్స్, గంజాయితో అడ్డంగా చిక్కారు. దీంతో హైదరాబాద్ పోలీసులు షణ్ముఖ్ ను అరెస్ట్ చేశారు. ఆపై ప‌రారీలో ఉన్న సంప‌త్ ను కూడా అదుపులోకి తీసుకుని.. అన్న‌ద‌మ్ములిద్ద‌రినీ పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించారు. డ్ర‌గ్స్ కేసులో ష‌ణ్ముఖ్ అరెస్ట్ కావ‌డంతో ఈ న్యూస్ ఇప్పుడు అటు ప్ర‌ధాన మీడియాలో, ఇటు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కాగా, గ‌తంలో హిట్ అండ్ ర‌న్ కేసులో కూడా ష‌ణ్ముఖ్ అరెస్ట్ అయ్యాడు.

Join WhatsApp