Prabhas-Anushka Engagement Rumors Spark Frenzy

Prabhas: రెబల్స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. అదేవిధంగా టాలీవుడ్ హీరోలలో టాప్ హీరోగా నిలిచాడు. ఇక ఇటీవల సలార్ సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చిన ప్రభాస్ మంచి విజయాన్ని దక్కించుకున్నాడు. ఇక గత కొంతకాలంగా ప్రభాస్కి రేపో మాపో పెళ్లి అంటూ అనేక వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

Prabhas-Anushka Engagement Rumors Spark Frenzy

బాహుబలి సినిమా నాటి నుంచి నేటి వరకు ప్రభాస్ మరియు అనుష్కలపై ఏదో వార్త వినిపిస్తూనే ఉంది. ఇక దీనిపై వీరిద్దరూ స్పందించి మేమిద్దరం ఫ్రెండ్స్ అన్నప్పటికీ ప్రేక్షకులు అవి పట్టించుకోవడం లేదు. ఇక తాజాగా ప్రభాస్ పై మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభాస్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. బాలీవుడ్ హీరోయిన్ తో ప్రభాస్ ఎంగేజ్మెంట్ త్వరలోనే జరగనున్నట్లు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read: Upasana: పెళ్లికి ముందే తన గొప్ప మనసు చాటుకున్న ఉపాసన… ఫొటోస్ వైరల్..!

వీరిద్దరి నిశ్చితార్థానికి వేదిక కూడా ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తుంది. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరుపొందిన ప్రభాస్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడట. ఇక తాజాగా ప్రభాస్ ఓ బాలీవుడ్ హీరోయిన్ ప్రేమించుకుంటున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె మరెవరో కాదు ప్రభాస్తో నటించిన ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

Prabhas-Anushka Engagement Rumors Spark Frenzy

ఇక ఈ వార్త మన టాలీవుడ్ లో కంటే బాలీవుడ్ లో కూడా వస్తుంది. ఇక వీరి ఎంగేజ్మెంట్ కి వేదిక కూడా ఫిక్స్ అయిందట. వచ్చేవారం మాల్దీవుల్లో ప్రభాస్ మరియు కృతి సన‌న్ ఎంగేజ్మెంట్ జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వార్త తెలిసిన ప్రభాస్ ఫ్యాన్స్..” ప్రభాస్కి అనుష్క అయితేనే సెట్ అవుతుంది. ప్రభాస్ పక్కన మరే హీరోయిన్ ని మేము ఊహించుకోలేము. ఇది ఓ పుకారు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.(Prabhas)

Join WhatsApp