Prabhas Health Camp Moggalthuru

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎల్లో సినిమాల్లో నటించిన ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్కి చేరుకున్నాడు. ఇక ఇటీవలే సలార్‌ సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ లైన్ అప్ లో దాదాపు నాలుగు సినిమాల దాకా ఉన్నాయి. ఇక‌ ప్రభాస్ సినిమాల విషయం పక్కన పెడితే.. ఇటు సినిమాలకి ఎంత ప్రాముఖ్యత ఇస్తాడో.. మరోపక్క ఫ్యామిలీకి కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తాడు ప్రభాస్.

Prabhas Health Camp Moggalthuru

ప్రభాస్ కి అత్యంత ఇష్టమైన మనిషి ఎవరు అంటే తన పెదనాన కృష్ణంరాజు అని చెప్పొచ్చు. ఇక‌ కన్న కొడుకు కాకపోయినా ప్రభాస్ ని కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకునేవాడు కృష్ణంరాజు. అదేవిధంగా ప్రభాస్ సైతం తన పెదనాలని ఎంతో బాగా చూసుకునేవాడు. ఇక హఠాత్తుగా కృష్ణంరాజు చనిపోవడంతో చాలా కృంగిపోయాడు ప్రభాస్. ఇక ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి కోలుకొని సినిమాల్లోకి వచ్చాడు.

Also Read: Meera Chopra: నా పెళ్లికి చరణ్, ఎన్టీఆర్ లను పిలవను.. పవన్ కళ్యాణ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్..!!

ఇక తాజాగా ప్రభాస్ గురించి ఓ వార్త వైరల్ అవుతుంది. కృష్ణంరాజు జయంతి సందర్భంగా ప్రభాస్ ఓ అద్భుతమైన పనిని చేశాడు. ఈ పని మూలంగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రభాస్ కి వీడియో కాల్ చేశాడట. ఆంధ్రప్రదేశ్ లో కృష్ణంరాజు జయంతి సందర్భంగా ప్రభాస్ ప్రత్యేకమైన హెల్త్ క్యాంప్ ని నిర్వహించారు. కృష్ణంరాజు జన్మస్థలమైన మొగల్తూరు నియోజవర్గం లో ఫ్రీ మెడికల్ క్యాంప్‌ని నిర్వహించాడు ప్రభాస్. షుగర్ పేషెంట్స్ దాదాపు వెయ్యమంది వచ్చి అక్కడ చికిత్స తీసుకున్నారు.

Prabhas Health Camp Moggalthuru

దాదాపు వచ్చిన ప్రతి ఒక్కరికి టెస్టులు చేసి ఉచితంగా మందులను అందించారు. అదేవిధంగా ప్రతి ఏడాది కృష్ణంరాజు జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రభాస్ తరపున శ్యామల దేవి మాటిచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభాస్ కి కాల్ చేసి మెచ్చుకున్నారట. ఇక‌ ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్త తెలిసిన ప్రేక్షకులు ప్రభాస్ని అప్రిషియేట్ చేస్తున్నారు.(Prabhas)

Join WhatsApp