Prabhas Is Going To Take A Break From Films

Prabhas: బాహుబ‌లి మూవీతో పాన్ ఇండియా స్టార్ గా అవ‌త‌రించిన ప్ర‌భాస్‌.. ఆ త‌ర్వాత వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అయ్యాడు. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ వంటి సినిమాలు భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లై ప‌రాజ‌యం పాల‌య్యాయి. అయితే ఇటీవ‌ల విడుద‌లైన స‌లార్ మూవీ మాత్రం ప్ర‌భాస్ ను మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ ఎక్కించింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ లైనప్ లో స‌లార్ 2, క‌ల్కీ 2898 ఏడీ, రాజా సాబ్ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాగే సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీకి క‌మిట్ అయ్యాడు.

Prabhas Is Going To Take A Break From Films

వీటిలో మారుతి తెర‌కెక్కిస్తున్న రాజా సాబ్‌, నాగ్ అశ్విన్ డైరెక్ష‌న్ లో రూపుదిద్దుకున్న పాన్ వ‌ర‌ల్డ్ మూవీ క‌ల్కీ 2898 ఏడీ షూటింగ్స్ ఆల్మోస్ట్ ఆఖ‌రి ద‌శ‌కు చేరుకున్నాయి. 2024, 2025లో ఈ చిత్రాలు విడుద‌ల అయ్యే అవ‌కాశాలు కూడా ఉన్నాయి. అయితే స‌లార్ 2, స్పిరిట్ చిత్రాలు ఇప్ప‌ట్లో ప‌ట్టాలెక్కేలా క‌నిపించ‌డం లేదు. ఇందుకు కార‌ణం ప్ర‌భాసే. తాజాగా డార్లింగ్ కి సంబంధించి ఓ చేదు వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. ప్ర‌భాస్ సినిమాల‌కు బ్రేక్ ఇవ్వ‌బోతున్నాడ‌ట‌. కొద్ది నెల‌లు షూటింగ్స్ కు దూరంగా ఉండాల‌ని భావిస్తున్నారని ఇన్‌సైడ్ జోరుగా టాక్ నడుస్తోంది.

ప్ర‌ముఖ స్టార్ హీరో స‌మంత ఇటీవ‌ల సినిమాల‌కు బ్రేక్ ప్ర‌క‌టించింది. మ‌యోసైటిస్ వ్యాధి బారిన ప‌డ్డ స‌మంత‌.. హెల్త్ ను చ‌క్క‌దిద్దుకునే ప‌డిలో ప‌డింది. ఇప్పుడు స‌మంత రూట్ లోనే ప్ర‌భాస్ కూడా వెళ్ల‌బోతున్నాడు. చాలా కాలం నుంచి ప్ర‌భాస్ అనేక హెల్త్ ఇష్యూస్‌తో స‌ఫ‌ర్ అవుతున్నాడు. త‌ర‌చూ ఫారెన్ వెళ్తూ ట్రీట్‌మెంట్ చేయించుకుంటున్నాడు. కొద్ది రోజుల క్రితం అత‌ని మోకాలికి స‌ర్జరీ కూడా జ‌రిగింది.(Prabhas)

Also Read: Raashii Khanna: స్నానం ఎప్పుడు చేశావ్‌.. రాశీ ఖ‌న్నాను అడ‌గ‌కూడ‌ని ప్ర‌శ్న అడిగిన పాపుల‌ర్ హీరో!

ఈ నేప‌థ్యంలోనే కొద్ది నెల‌లు కెమెరాకు దూరంగా ఉండాల‌ని ప్ర‌భాస్ నిర్ణ‌యించుకున్నాడ‌ట‌. ఇందులో భాగంగానే త్వ‌ర‌త్వ‌ర‌గా క‌ల్కీ 2898 ఏడీ, రాజా సాబ్ చిత్రాల‌ను ఫినిష్ చేసే ప‌నిలో ప‌డ్డాడ‌ట‌. ఈ రెండు ప్రాజెక్ట్స్ పూర్తైన వెంట‌నే డార్లింగ్ ఫుల్ రెస్ట్ మోడ్‌లోకి వెళ్ల‌నున్నాడు. పూర్తి ఫోక‌స్ ఆరోగ్యం మ‌రియు ఫిట్‌నెస్‌ పెట్ట‌నున్నాడ‌ట‌. అయితే ఎంత కాలం సినిమాల‌కు బ్రేక్ ఇస్తాడు అన్న‌ది మాత్రం స్ప‌ష్ట‌త లేదు. మూడు నుంచి ఎనిమిది నెల‌ల మ‌ధ్య ఉండొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఏదేమైనా సినిమాల‌కు ప్ర‌భాస్ బ్రేక్ ఇవ్వ‌డం అనేది ఫ్యాన్స్ కు చేదు వార్త‌నే చెప్పొచ్చు.

Join WhatsApp