Prabhas Kalki remuneration.. how

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.అయితే ఈ సినిమా ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఈ సినిమాని ముందుగా మే 9న విడుదల చేయాలని మూవీ మేకర్స్ అనుకున్నప్పటికీ దేశవ్యాప్తంగా ఎన్నికల కోలాహలం ఉండడంతో దీన్ని వాయిదా వేశారు.అయితే రీసెంట్ గా ఈ మూవీ జూన్ 27న విడుదల కాబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు. ఈ విషయాలన్నీ పక్కన పెడితే.. కల్కి సినిమా దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది.

Prabhas Kalki remuneration.. how

కానీ అధికారిక లెక్కల ప్రకారం ఈ సినిమాకి 1000 కోట్ల వరకు ఖర్చవుతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాకి ప్రభాస్ తో పాటు ఇతర నటీనటులు తీసుకునే రెమ్యూనరేషన్ తో ఏకంగా 20,30 సినిమాలు కూడా తీయచ్చు అంటున్నారు ఈ విషయం తెలిసిన సామాన్య జనాలు. మరి ఇంతకీ ప్రభాస్ మరియు ఇతర నటినటుల రెమ్యూనరేషన్ ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇండియాలోనే మొదటి పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ ఇప్పటికే 100 కోట్ల నుండి 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.(Prabhas)

Also Read: 18 Years Of Pokiri: పోకిరి మూవీ ని మిస్ చేసుకున్న హీరో, హీరోయిన్స్.. ఎవరంటే..?

అయితే కల్కి సినిమాకి మాత్రం ఆయన 150 నుండి 200 కోట్లు మధ్యలో రరెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.అలాగే ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్ గా కనిపించబోతున్నారట.అది కూడా కొద్దిసేపు మాత్రమే. అయితే ఆ కొద్దిసేపు స్క్రీన్ మీద కనిపించడం కోసమే కమల్ హాసన్ దాదాపు 20 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారట. ఇక మరో హీరో బాలీవుడ్ హీరో బిగ్ బి అమితాబచ్చన్ 30 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారట. అంతేకాకుండా ఇందులో మెయిన్ హీరయిన్ గా చేసే దీపికా పదుకొనే 20 కోట్లు, దిశాపటాని 5 కోట్లు తీసుకుంటున్నారట.

Prabhas Kalki remuneration.. how

ఇక వీళ్లే కాకుండా ఈ సినిమాలో నటించే మిగతా ఆర్టిస్టులు అలాగే సినిమాకి సంబంధించిన దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్, ఇతర టెక్నీషియన్లు అందరికీ కలిపి దాదాపు మరో 250 నుండి 300 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఇస్తున్నారట నిర్మాత . ఇలా ఈ సినిమా బడ్జెట్ 600 లోపు అనుకున్నప్పటికీ 1000 కోట్లకు దగ్గరగా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ విషయం కాస్త నెట్టింట్లో వైరల్ అవ్వడంతో ఈ సినిమాలో ప్రభాస్ తీసుకునే రెమ్యూనరేషన్ తో ఏకంగా ఓ 10, 20 సినిమాలు తీయొచ్చు. ఎందుకంటే బలగం వంటి చిన్న సినిమాలు తీయాలంటే కనీసం 10 కోట్లు కూడా పట్టవు. అలా ప్రభాస్ పారితోషికంతో 10,20 చిన్న సినిమాలు తీయొచ్చు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.(Prabhas)

Join WhatsApp