Prabhas taken a luxurious house in London For Rent

Prabhas: బాహుబ‌లి మూవీతో ప్రాంతీయ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన‌ ప్ర‌భాస్.. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేశాడు. కానీ ఆ స్థాయి హిట్ మాత్రం ప‌డ‌లేదు. సాహో, రాధేశ్యామ్‌, ఆదిపురుష్ చిత్రాలు భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి. అయితే గ‌త ఏడాది విడుద‌లైన స‌లార్ మాత్రం ప్ర‌భాస్ ను మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ ఎక్కింది. ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది.

Prabhas taken a luxurious house in London For Rent

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేతిలో నాలుగు ప్రాజెక్ట్స్ లో ఉన్నాయి. అందులో కల్కి 2898 ఏడీ ఒక‌టి. దర్శకుడు నాగ్‌ అశ్విన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. మైథలాజికల్‌ అంశాలతో పాటు సైన్స్ ఫిక్షన్‌ ఎలిమెంట్లతో రూపుదిద్దుకున్న చిత్ర‌మిది. ఇందులో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కు ఎంతో మంది స్టార్స్ భాగం అయ్యారు. అలాగే మారుతి డైరెక్ష‌న్ లో రాజా సాబ్‌, ప్ర‌శాంత్ నీల్ తో స‌లార్ 2, సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో స్పిరిట్ వంటి చిత్రాలు ప్ర‌భాస్ లైన‌ప్ లో ఉన్నాయి.

వీటిలో రాజా సాబ్ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. స‌లార్ 2, స్పిరిట్ చిత్రాలు త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌బోతున్నాయి. సినిమాల గురించి ప‌క్క‌న పెడితే.. ఇటీవ‌ల కాలంలో హెల్త్ ఇష్యూస్ కార‌ణంగా ప్ర‌భాస్ త‌ర‌చూ ఫారెన్ వెళ్తున్న సంగ‌తి తెలిసిందే. రీసెంట్ గా ఆయ‌న విదేశాల్లో మోకాలి స‌ర్జ‌రీ కూడా చేయించుకున్నారు. అయితే ఇండియాలో కంటే ఫారెన్ లో ఎక్కుగా ఉంటున్న ప్ర‌భాస్‌.. తాజాగా లండ‌న్ లో ఓ విలాస‌వంత‌మైన ఇంటిని అద్దెకు తీసుకున్నార‌ట‌.(Prabhas)

Also Read: Khadgam: ఖడ్గం మూవీలో సోనాలి బింద్రేకు డబ్బింగ్ చెప్పిన టాప్ హీరోయిన్ ఎవ‌రో గెస్ చేయ‌గ‌ల‌రా?

ప్ర‌తిసారి హోట‌ల్స్ లో ఉండ‌టం ఇష్టంలేక త‌న‌కు సౌకర్యవంతంగా ఉండే ఓ హౌస్‌ను ఎంపిక చేసుకున్నార‌ట‌. ఇక ఆ ఇంటికి ఒక్క నెల రెంట్ తెలిస్తే మ‌తిపోతుంది. ఎందుకంటే, లండ‌న్ లో ల‌గ్జ‌రీ ఇంటి కోసం ప్ర‌భాస్ నెల‌కు రూ. 60 ల‌క్ష‌లు ఖ‌ర్చు పెడుతున్నాడ‌ట‌. ఈ విష‌యం నెట్టింట వైర‌ల్ గా మార‌డంతో నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఒక్క నెల‌కు రూ. 60 ల‌క్ష‌లు రెంటా.. ఆ డ‌బ్బుల‌కు ఇండియాలో ఒక మంచి ఇల్లే వచ్చేస్తుంద‌ని చ‌ర్చించుకుంటున్నారు.

Join WhatsApp