Prabhas wedding reception mystery

Prabhas: టాలీవుడ్ లో రెబల్స్టార్ ప్రభాస్ గా పేరుగాంచిన డార్లింగ్ గురించి ప్రత్యేకమైన సంబోధన అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలను తన ఖాతాలో వేసుకున్న ప్రభాస్ ఇటీవలే సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు. అదేవిధంగా బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరో అయిన ప్రభాస్ ప్రస్తుతం నాలుగు సినిమాలు పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు.

Prabhas wedding reception mystery

ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ పెళ్లి గురించి తాజాగా అనేక రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కొంతకాలం స్వీటీతో రిలేషన్ అని కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ప్రస్తుతం ఏమో కృతి సనన్ తో ప్రభాస్ రిలేషన్ లో ఉన్నట్లు వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు ఓ పుకారు షికారు చేసింది. ఇక వీటిపై ప్రభాస్ స్పందించకపోవడంతో వీటికి ఆద్యం పోసినట్లు అయ్యింది.

Also Read: Jayam movie: జయం మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా?.. అతను ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో.‌.!

ఇక ఇదంతా ఇలా పెడితే తాజాగా దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. రౌడీ బాయ్స్ అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆశిస్ పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇక ఆశిష్ పెళ్లికి పెద్దగా ఏ సెలబ్రెటీస్ ని పిలవకపోయినా రిసెప్షన్ కి మాత్రం ప్రతి ఒక్క సెలబ్రిటీని ఆహ్వానించారు. ఇక వీరి ఆహ్వానం పుచ్చుకున్న స్టార్ సెలబ్రిటీస్ అందరూ కూడా హాజరయ్యారు. కానీ ఒక్క ప్రభాస్ మాత్రం రాలేదు.

Prabhas wedding reception mystery

దీనికి కారణం ప్రభాస్ షూటింగ్స్ లో బిజీగా ఉండడమే అయినట్లు తెలుస్తుంది. సాధారణంగా ప్రభాస్కి చిన్న, పెద్ద అనే భేదాలు ఏమీ ఉండవు. తన దగ్గర పని చేసే వారిని కూడా తనతో పాటుగా చూస్తూ ఉంటాడు. ఇక అలాంటివాడు ఆశిష్ పెళ్లికి హాజరు కాకపోవడంతో ప్రతి ఒక్కరూ నిరాశకు గురయ్యారు. ఇక దీనికి కారణం ప్రభాస్ షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉండడమే అని తెలిసి రియలైజ్ అయ్యారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తుంది.(Prabhas)

Join WhatsApp