Prabhas will enter the field to support Pawan Kalyan

Prabhas: ఒక పేరు చెప్పితే ప్రేక్షకుల గుండెల్లో తెలియని ఓ ఫీలింగ్ వస్తుంది.. అదే పేరు సినిమాల్లోనే కాదు పాలిటిక్స్ లో కూడా ఈ మధ్య గట్టిగా వినిపిస్తుంది. ఎక్కడికి వెళ్లినా ప్రతి వైపు ఆయన ఊసే వినిపిస్తుంది. అంతలాగా ట్రెండ్ అవుతున్నాడు మరి ఆ హీరో. సినిమాలలో మంచి జోరు పై కొనసాగుతున్న సమయంలో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి వరుస అపజయాలను ఎదురుచూసినప్పటికీ ఏమాత్రం కృంగిపోకుండా ఎక్కడైతే ఓటమపాలు అయ్యాడు అక్కడి నుంచే మళ్లీ మొదలుపెట్టి ప్రస్తుతం స్టార్ పొలిటీషియన్ గా నిలిచాడు. మరి ఆ హీరో ఎవరు? ఆ పొలిటిషన్ ఎవరు? అని ఆలోచిస్తున్నారా?.. అదేనండి మన పవన్ కళ్యాణ్.

Prabhas will enter the field to support Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు వినగానే తన అభిమానులలోనే కాదు సాధారణమైన మనుషులలో కూడా తెలియని అనుభూతు కలుగుతుంది. అటువంటి గొప్ప పేరు మరి ఇది. మొదట్లో పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు.. నీకు ఇవన్నీ అవసరమా? మూసుకొని సినిమాలు చేసుకోకుండా? అంటూ చాలామంది అనేక విధాలుగా కించపరిచారు. కానీ వాటన్నిటికీ నేటి కాలంలో ఆయనకి ఉన్న పేరు ప్రఖ్యాతలను చూపిస్తూ వారి నోరులను మోపించాడు పవన్. మొదట పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈయనకి అపజయాలే మిగిలాయి.

Also Read: Allari Naresh: అన్నయ్య నేను ఓకే అమ్మాయిని ప్రేమించాం.. అందుకే అలా జరిగింది..!

ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ కి పెద్దగా ఎవరు మద్దతు తెలపలేదు. కానీ తాను సినిమాలపై సంపాదించిన డబ్బు మొత్తం జనాలకి ఖర్చు చేస్తూ తన గొప్ప మనస్తత్వాన్ని చాటుకుంటూ ప్రేక్షకుల మదిలలో నిలిచిపోయాడు పవన్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ టిడిపి తో పొత్తు ఏర్పరచుకుని దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే పవన్ కి మద్దతుగా పలువురు సినిమా సెలబ్రిటీలు సైతం నిలుస్తున్నారు.

Prabhas will enter the field to support Pawan Kalyan

ముందుగా తన కుటుంబం నుంచి నాగబాబు మరియు చిరంజీవి, వరుణ్ తేజ్ ఇలా అనేకమంది ఆయనని గెలిపించుకునేందుకు ముందుకు వచ్చారు. ఈ తరుణంలోనే రెబల్ స్టార్ ప్రభాస్ సైతం ఈ లిస్టులో చేరనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ప్రభాస్ పేరు పాలిటిక్స్ లో వినిపిస్తుంది. తాజాగా పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ప్రభాస్ నిలబడుతున్నట్లు తెలుస్తుంది. ఇదే వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ చక్కెరలు కొడుతుంది. ఇదే కనుక నిజం అయితే జనసేన కి గలుపు పక్కా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు పవర్ స్టార్ ఇటు రెబల్ స్టార్.. రెండు స్టార్లు కలిస్తే విజయం గారంట్రీ అని రాసి పెట్టుకోవచ్చు.(Prabhas)

Join WhatsApp