Pragya Jaiswal Pearls Dress Price Details Here

Pragya Jaiswal: అందం, అంత‌కు మించిన టాలెంట్ ఉన్నా కూడా ఆఫ‌ర్లు లేక అల్లాడిపోతున్న హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు. మధ్యప్రదేశ్ భామ ప్ర‌గ్యా జైస్వాల్ కూడా ఆ కోవ‌కే చెందుతుంది. మోడ‌ల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్ర‌గ్యా జైస్వాల్‌.. 2014లో విరాట్టు అనే త‌మిళ చిత్రంతో హీరోయిన్ గా మారింది. 2015లో వ‌చ్చిన కంచె మూవీతో తెలుగులో పాపుల‌రిటీ సంపాదించుకుంది. ఆ త‌ర్వాత ఓం నమో వేంకటేశాయ, గుంటూరోడు, న‌క్ష‌త్రం, జయ జానకి నాయక త‌దిత‌ర చిత్రాల్లో న‌టించినా కూడా స‌క్సెస్ అవ్వ‌లేక‌పోయింది.

Pragya Jaiswal Pearls Dress Price Details Here

2021లో వ‌చ్చిన అఖండ మూవీ ప్ర‌గ్యా కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కానీ, దుర‌దృష్టం ఏంటంటే.. అఖండ వంటి సూప‌ర్ హిట్ ఫిల్మ్ ఖాతాలో ప‌డినా ప్ర‌గ్యాకు మాత్రం అవ‌కాశాలు రాలేదు. అఖండ త‌ర్వాత షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, యాడ్స్ లో త‌ప్పా వెండితెర‌పై క‌నిపించ‌లేదు. సినిమాలు లేక‌పోయినా ప్ర‌గ్యా సోష‌ల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అందాల‌తో కుర్రాళ్ల‌ను తెగ క‌వ్విస్తూ ఉంటుంది.

ఇక‌పోతే రీసెంట్ గా ప్ర‌గ్యా జైస్వాల్ త‌న బెస్ట్ ఫ్రెండ్ మ‌రియు ప్ర‌ముఖు హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ వివాహానికి హాజ‌రు అయింది. బాలీవుడ్ న‌టుడు, నిర్మాత జాకీ భాగ్నానీని ఫిబ్ర‌వ‌రి 21న రకుల్ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ద‌క్షిణ గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్టులో కుటుంబ‌స‌భ్యులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో ర‌కుల్‌-జాకీ వివాహం వైభ‌వంగా జ‌రిగింది. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కూడా వీరి పెళ్లిలో సంద‌డి చేశారు.(Pragya Jaiswal)

Also Read: Vennela Kishore: ప్రీ రిలీజ్‌ ఈవెంట్స్ అంటేనే భ‌య‌ప‌డుతున్న వెన్నెల కిషోర్.. కార‌ణం ఏంటంటే?

అలాగే ప్ర‌గ్యా జైస్వాల్ కూడా ర‌కుల్‌-జాకీ పెళ్లికి వెళ్లింది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో అంద‌రినీ ఎట్రాక్ట్ చేసింది. ముత్యాలు పొదిగిన లెహంగా లో గ్లామ‌ర్ మెరుపులు మెరిపించింది. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను తాజాగా ప్ర‌గ్యా త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ఈ ఫోటోలు చూసి నెటిజ‌న్లు మ‌రియు అభిమానులు కామెంట్ బాక్స్ లో హార్ట్‌ల‌తో నింపేస్తున్నారు. ఇక ర‌కుల్ పెళ్లిలో ప్ర‌గ్యా ధ‌రించిన ముత్యాల డ్రెస్ ధ‌రెంతో తెలిస్తే దిమ్మ‌తిరిగిపోద్ది. చాలా ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తున్న ఆ లెహంగా సెట్ కాస్ట్ రూ. 3.5 నుంచి 4 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంది. ప్ర‌ముఖ డిజైన‌ర్ తో స్పెష‌ల్ గా ప్ర‌గ్యా ఆ డ్రెస్ ను డిజైన్ చేయించుకుంద‌ని అంటున్నారు.

Join WhatsApp