Prashanth Varma Next movie Heroine

Prashanth Varma: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు హనుమాన్ మూవీ విడుదలడంతో ఇండస్ట్రీ మొత్తం వినిపించింది. ఇక అంతగా గుర్తింపు లేని డైరెక్టర్ అంత పెద్ద ప్రయోగాత్మక సినిమా తీయడంతో చాలామంది ఈ సినిమా డైరెక్టర్ కి ఫిదా అయిపోయారు. అంతేకాకుండా 500 కోట్ల బడ్జెట్ మూవీ ని కేవలం 50 కోట్ల బడ్జెట్లో తీసి అందరితో వహ్వా.. అనిపించుకున్నారు. దాంతో సంక్రాంతికి హనుమాన్ మూవీ విడుదలైనప్పటి నుండి ఇండస్ట్రీ మొత్తం ప్రశాంత్ వర్మ పేరునే జపిస్తోంది.

Prashanth Varma Next movie Heroine

అంతేకాదు స్టార్ హీరోలు సైతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా అయినా చేయాలి అని అనుకుంటున్నారు. అయితే తాజాగా ప్రశాంత్ వర్మ ఓ హీరోయిన్ మత్తులో మునిగిపోయారు అంటూ ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.మరి ఇంతకీ ప్రశాంత్ వర్మ ఏ హీరోయిన్ మాయలో పడిపోయారో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రశాంత్ వర్మ హనుమాన్ సమయంలోనే హనుమాన్ 2 కూడా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.(Prashanth Varma)

Also Read: Chiranjeevi: చిరంజీవి స్వ‌యంగా త‌న సినిమాల్లో రెండు సార్లు ఛాన్స్ ఇస్తే నో చెప్పిన హీరో ఎవ‌రు..?

అంతే కాదు హనుమాన్ 2 మూవీలో హీరో తేజా సజ్జా కేవలం హనుమంతున్ని కొలిచే హనుమంతు పాత్రలోనే ఉంటారని, మెయిన్ హీరో హనుమాన్ క్యారెక్టర్ లో ఉండే హీరోది అని చెప్పారు.అయితే హనుమంతుడి క్యారెక్టర్ కోసం ఇప్పటికే రానా,చిరంజీవి, రామ్ చరణ్ వంటి హీరోల పేర్లు వినిపించాయి.అయితే ఇప్పటివరకు ఏ హీరో పేరు కూడా అఫీషియల్ గా బయటికి రాలేదు.

Prashanth Varma Next movie Heroine

అయితే ఈ సినిమా కంటే ముందే ప్రశాంత్ వర్మ ఆక్టోపస్ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ చేస్తున్నారు.ఈ మూవీలో ఐదుగురు హీరోయిన్స్ ని చూపిస్తారట. అయితే 65% ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిందని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ని తీసుకోవాలని ప్రశాంత్ వర్మ భావిస్తున్నారట. అయితే అనుపమ పరమేశ్వరన్ తన సినిమాలో బాగా సెట్ అవుతుందని,అందుకే అనుపమకి ఈ సినిమాలో లీడ్ రోల్ ఇవ్వాలని చూస్తున్నారట.మరి ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ లో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.(Prashanth Varma)

Join WhatsApp