Priyamani shared her experience of Paruthiveeran Movie Shooting

Priyamani: కేర‌ళ కుట్టి ప్రియ‌మ‌ణి సెకండ్ ఇన్నింగ్స్ లోనూ ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఒక‌ప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ప్రియ‌మ‌ణి.. ప్ర‌స్త‌తం తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనే కాకుండా స్టార్ హీరోల సినిమాల్లో బ‌ల‌మైన స‌హాయ‌క పాత్ర‌ల‌ను పోషిస్తూ స‌త్తా చాటుతోంది. వెబ్ సిరీస్‌ల‌లో న‌టిస్తోంది. గ‌త ఏడాది జ‌వాన్ మూవీలో కీల‌క పాత్ర‌లో క‌నిపించి మెప్పించింది.

Priyamani shared her experience of Paruthiveeran Movie Shooting

ఇటీవ‌ల ఆర్టికల్ 370, భామా కలాపం 2 వంటి సినిమాల‌తో ప‌ల‌క‌రించింది. ప్ర‌స్తుతం ప్రియ‌మ‌ణి చేతిలో ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఉన్నాయి. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. సుధీర్గ సినీ ప్ర‌యాణంలో ప్రియ‌మ‌ణి ఉత్త‌మ న‌టిగా ఎన్నో అవార్డులు అందుకుంది. అందులో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన జాతీయ అవార్డు కూడా ఒక‌టి. పరుత్తివీరన్ మూవీకి గానూ ఉత్త‌మ న‌టిగా ప్రియ‌మ‌ణి జాతీయ అవార్డు అందుకుంది.

అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ప్రియ‌మ‌ణి.. పరుత్తివీరన్ సినిమా షూటింగ్ స‌మ‌యంలో ఎదురైన షాకింగ్ అనుభ‌వాల‌ను పంచుకుంది. పరుత్తివీరన్ షూటింగ్ మధురైలోని కొన్ని ప‌ల్లెటూళ్ల‌లో జ‌రిగింద‌ని.. ఆ స‌మ‌యంలో చాలా ఇబ్బంది ప‌డ్డాన‌ని ప్రియ‌మ‌ణి ఆనాటి రోజుల‌ను గుర్తుచేసుకుంది. పరుత్తివీరన్ షూటింగ్ జరిగే సమయంలో క్యారవాన్ తరహా సౌకర్యాలు లేవని.. క‌నీసం వాష్ రూమ్స్ కూడా ఉండేవి కాద‌ని ప్రియ‌మ‌ణి తెలిపింది.(Priyamani)

Also Read: Rajamouli: వ‌య‌సులో రాజ‌మౌళి కంటే ఆయ‌న భార్య ర‌మా ఎన్నేళ్లు పెద్ద‌వారో తెలుసా?

ఆ ప‌ల్లెటూళ్ల‌లో నివాసం ఉన్న‌వారి రెస్ట్ రూమ్స్ ను వినియోగించాల్సి వచ్చేదని.. లేకపోతే ఓపెన్ గా వెళ్లాల్సి వచ్చేదని ప్రియ‌మ‌ణి పేర్కొంది. దీంతో ప్రియ‌మ‌ణి కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారాయి. కాగా, పరుత్తివీరన్ 2007లో విడుదలైన తమిళ రొమాంటిక్ డ్రామా చిత్రం. అమీర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంతోనే కార్తీ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రియమణి హీరోయిన్ గా యాక్ట్ చేసింది.

Join WhatsApp