Priyanka Chopra And Nick Jonas Leave Their Los Angeles Home

Priyanka Chopra: మాజీ ప్ర‌పంచ సుంద‌రి, బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అతి తక్కువ సమయంలోనే భారీ స్టార్డ‌మ్ ను సంపాదించుకుని వెండితెర‌పై ఓ వెలుగు వెలిగిన ప్రియాంక చోప్రా.. 2017లో హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ స‌మ‌యంలోనే వయసులో తనకంటే పదేళ్లు చిన్నవాడైన ప్రముఖ పాప్‌ సింగర్ నిక్ జోనాస్ తో ప్రేమ‌లో ప‌డింది. కొన్ని నెలలు డేటింగ్ చేశాక ఇద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

Priyanka Chopra And Nick Jonas Leave Their Los Angeles Home

2018లో పెద్ద‌ల అంగీకారంతో ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్‌ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మ్యారేజ్ అనంత‌రం ప్రియాంక చోప్రా త‌న భ‌ర్త‌తో క‌లిసి అమెరికాకు వెళ్లిపోయి అక్క‌డే స్థిర‌ప‌డింది. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లో 20 మిలియ‌న్ డాల‌ర్స్ ఖ‌ర్చు పెట్టి ఓ ల‌గ్జ‌రీ హౌస్‌ను కొనుగోలు చేసి.. అందులో త‌మ కొత్త కాపురాన్ని ప్రారంభించారు. 2022 లో ఈ దంప‌తులు సరోగసి ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

కుమార్తె మాల్టీ మేరీ చోప్రా జోనాస్ మరియు పెంపుడు జంతువులతో ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ దంపతుల‌కు లాస్ ఏంజిల్స్‌లో విలాస‌వంత‌మైన జీవితాన్ని గ‌డుపుతున్నారు. అయితే తాజాగా ఈ జంట త‌మ లగ్జ‌రీ హౌస్ ను వ‌దిలేసి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. వాట‌ర్ లీక్ అవుతుండ‌టం వ‌ల్ల ఇంట్లో చాలా ప్ర‌దేశాలు డ్యామేజ్ అయ్యాయ‌ట‌. దీంతో న‌ష్ట‌ప‌రిహారం ఇప్పించాలంటూ ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్‌లు కోర్టును ఆశ్ర‌యించారు.(Priyanka Chopra)

Also Read: Rakul Preet Singh: ప్రియుడితో మ‌రో 20 రోజుల్లో పెళ్లి.. స‌డెన్ గా యూట‌ర్న్ తీసుకున్న ర‌కుల్‌..!

ఆ ఇల్లు అమ్మిన వ్య‌క్తిపై న‌ష్ట‌ప‌రిహారం ద‌వా వేశారు. ఇందులో భాగంగానే ప్రియాంక చోప్రా దంప‌తులు త‌మ కూతురు మ‌రియు పెంపుడు జంతువుల‌తో బ‌య‌ట‌కు వ‌చ్చేశార‌ట‌. ఈ మేర‌కు స్థానిక మీడియాలో జోరుగా వార్త‌లు వ‌స్తున్నాయి. లాస్ ఏంజిల్స్‌లో ప్రియాంక చోప్రా ఉంటున్న ఏడు ప‌డ‌క గ‌దుల ఇంటి ధ‌ర రూ. 165 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ట‌. ఏడు బెడ్‌రూమ్స్ తో పాటు తొమ్మిది బాత్‌రూమ్‌లు, ఉష్ణోగ్రత-నియంత్రిత వైన్ సెల్లార్, హోమ్ థియేటర్, బౌలింగ్ అల్లే, చెఫ్ కిచెన్, స్టీమ్ షవర్‌తో కూడిన స్పా, జిమ్‌ ఉన్నాయి. అన్ని సౌక‌ర్యాల‌తో అత్యంత విశాలంగా ఈ ఇల్లు ఉంటుంది. అయితే ప్ర‌స్తుతం వాట‌ర్ లీకేజ్ కార‌ణంగా ఈ ఇంటికి మ‌ర‌మ్మ‌తులు చేయించాలంటే 2.5 మిలియ‌న్ డాల‌ర్స్ ఖ‌ర్చు అవుతుంద‌ట‌.

Join WhatsApp