Priyanka Jain Says I made a Mistake by Going to Bigg Boss

Priyanka Jain: మౌనరాగం, జానకి కలగనలేదు వంటి సీరియల్స్ ద్వారా బుల్లితెరపై ఎంతో మంచి గుర్తింపు సంపాదించింది ప్రియాంక జైన్. ఇక ఈ సీరియల్స్ ద్వారా వచ్చిన గుర్తింపుతో ఈమెకు బిగ్ బాస్ 7 లో కంటెస్టెంట్ గా వెళ్లే అవకాశం కూడా వచ్చింది. అలా బిగ్ బాస్ 7 లోకి వచ్చి టాప్ 5 లో ఒకరిగా నిలిచింది ప్రియాంక జైన్.హౌస్ లో ఉన్న ఆడవాళ్ళందరిలో స్ట్రాంగ్ గర్లుగా పేరు తెచ్చుకుంది. అలాంటి ప్రియాంక జైన్ నేను బిగ్ బాస్ కి వెళ్లకుండా ఉండాల్సింది క్యాన్సర్ వచ్చింది అంటూ బోరున ఏడ్చేస్తూ ఒక సంచలన నిజాన్ని బయటపెట్టింది.

Priyanka Jain Says I made a Mistake by Going to Bigg Boss

అసలు విషయం ఏంటంటే.. ప్రియాంక జైన్ తల్లి క్యాన్సర్ బారిన పడిందట. ఇక ఈ విషయాన్ని ప్రియాంకనే స్వయంగా బయట పెట్టింది. ఆమె మాట్లాడుతూ.. నేను బిగ్ బాస్ కి వెళ్లి తప్పు చేశాను.బిగ్ బాస్ కి వెళ్లకుండా ఉండి ఉంటే నా తల్లి కి హెల్త్ సమస్యలు వచ్చేవి కావు. మా మమ్మీ గత కొద్ది రోజులుగా నెలసరి సమస్యతో బాధపడుతుంది.వయసు మీద పడడం వల్ల ఆమెకు ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంది.ఇక డాక్టర్ని కలిస్తే క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయని చెప్పారు. (Priyanka Jain)

Also Read: Anushka: ఆ బాలీవుడ్ హీరోయిన్ దయ వల్లే అనుష్క స్టార్ హీరోయిన్ అయ్యిందా..?

గర్భసంచి తీసేస్తే కొంతైనా ఆ సమస్య నుండి బయటపడవచ్చు అని తెలిపారు. కానీ నేను బిగ్ బాస్ కి వెళ్లడం వల్ల మా మమ్మీ నన్ను బిగ్ బాస్ లో చూడడం కోసం హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకోలేదు. ఒకవేళ నేను బిగ్ బాస్ లోకి వెళ్లకుండా ఉండి ఉంటే మా మమ్మీ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకొని ఆ సమస్య నుండి బయటపడేది.అలాగే నేను కూడా మా మమ్మీ తో ఉండి ఆమెను చాలా కేరింగ్ గా చూసుకునే దాన్ని.

Priyanka Jain: I made a mistake by going to Bigg Boss

కానీ బిగ్ బాస్ కి వెళ్లడం వల్లే ఇలా అయింది అంటూ బోరున ఏడ్చేసింది.అయితే ప్రియాంక జైన్ తల్లికి సక్సెస్ ఫుల్ గా సర్జరీ అయిందని తెలిపింది. ఇలా తన తల్లి గురించి ప్రియాంక జైన్ మాట్లాడుతూ బోరున ఏడ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లందరూ మీ మమ్మీకి ఏం కాదు ఆరోగ్యంగా ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు. (Priyanka Jain)

Join WhatsApp