Puri Jagannadh Mother Ammaji Heart Touching Comments On Her Son

Puri Jagannadh: డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ను ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎంతో మంది ద‌ర్శ‌కులు వ‌స్తుంటారు. కానీ, వారిలో కొంద‌రు మాత్ర‌మే ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చోటు ద‌క్కించుకోగ‌లుగుతారు. అలాంటి వారిలో పూరీ జ‌గ‌న్నాథ్ ఒక‌రు. స‌క్సెస్‌, ఫెయిల్యూర్స్‌ గురించి ప‌క్క‌న పెడితే తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో పూరీ జ‌గ‌న్నాథ్ త‌న‌కంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. మ‌హేష్ బాబు, ర‌వితేజ వంటి హీరోల‌కు స్టార్ ఇమేజ్ ను అందించారు.

Puri Jagannadh Mother Ammaji Heart Touching Comments On Her Son

అటువంటి పూరీ జ‌గ‌న్నాథ్ ప్రొఫెష‌న‌ల్ లైఫ్ మ‌రియు ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో చాలా క‌ష్టాలు ప‌డ్డాడు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన పూరీ జ‌గ‌న్నాథ్‌.. డైరెక్ట‌ర్ గా ఎద‌గ‌డానికి ఎంత‌గానో శ్ర‌మించాడు. ఎన్నో ఆటుపోట్లును ఎదుర్కొన్నాడు. సినిమా ఇండ‌స్ట్రీలో పూరీ జ‌గ‌న్నాథ్ ఎలాంటి క‌ష్టాలు ప‌డ్డారో తాజాగా ఆయ‌న త‌ల్లి అమ్మాజీ ఓ ఇంట‌ర్వ్యూ ద్వారా పంచుకున్నారు. త‌న‌యుడి గురించి హార్ట్ ట‌చ్చింది కామెంట్స్ చేశారు.

ఏడో త‌ర‌గ‌తి నుంచి పూరీ జ‌గ‌న్నాథ్ సినిమాల‌పై మ‌క్కువ పెంచుకున్నార‌ట‌. డిగ్రీ అనంత‌రం త‌ల్లిదండ్రుల అనుమ‌తితో ఆయ‌న ఇండ‌స్ట్రీ వైపు అడుగులు వేశారు. డైరెక్ట‌ర్ అవ్వాల‌నే త‌ప‌న‌తో సినిమా ఆఫీసుల చుట్టూ కాలిన‌డ‌క‌న తిరిగేవారు. దాదాపు ప‌న్నెండు సంవ‌త్స‌రాలు ఛాన్సులు కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడు. అన్నం తిన‌డానికి చేతిలో డ‌బ్బులు లేక మంచి నీళ్ల‌నే ఆహారంగా చేసుకున్న రోజులు కూడా ఎన్నో ఉన్నాయ‌ని పూరీ గురించి ఆయ‌న త‌ల్లి అమ్మాజీ ఎమోష‌న‌ల్ గా చెప్పుకొచ్చారు.(Puri Jagannadh)

Also Read: Prasanth Varma: హ‌నుమాన్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ‌లో ఈ స్పెష‌ల్ టాలెంట్ కూడా ఉందా.. వీడు మామూలోడు కాదు!

అలాగే డైరెక్ట‌ర్ అయ్యాక పూరీ జ‌గన్నాథ్ ద‌గ్గ‌ర ప‌ని చేసే ఒక కుర్రాడు రూ. 80 కోట్లు కొట్టేశాడ‌ట‌. అదే స‌మయంలో ఒక సినిమా తీసి పూరీ మ‌రింత న‌ష్ట‌పోయాడు. దాంతో ఆ అప్పులు తీర్చ‌డానికి దాదాపు ఐదు ఇళ్ల‌ను పూరీ అమ్మేశాడ‌ని అమ్మాజీ తెలిపారు. ఇక త‌న‌ను మోసం చేసి డ‌బ్బు కొట్టేసిన కుర్రాడి కాళ్లు చేతులు విరిచేద్దామ‌ని కొంద‌రు స‌ల‌హా ఇస్తే.. అందుకు పూరీ జ‌గ‌న్నాథ్ మాత్రం స‌సేమేరా అన్నార‌ట‌. అంత డ‌బ్బు పోగొట్టుకున్నా మాన‌వ‌త్వంతో అత‌డిని వ‌దిలేశాడ‌ని.. నా కొడుకు అంత‌టి ద‌యామ‌యుడ‌ని అమ్మాజీ తెలిపారు. దీంతో ఆవిడ వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారాయి. కాగా, లైగ‌ర్ డిజాస్ట‌ర్ త‌ర్వాత పూరీ జ‌గ‌న్నాథ్ రామ్ పోతినేనితో డ‌బుల్ ఇస్మార్ట్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం మార్చి 8న విడుద‌ల కాబోతోంది.

Join WhatsApp