Pushpa 2 title song steps composed dance master

Pushpa 2: అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప మూవీ ఎంతటి విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ అంతకుమించి టాక్ ని అందుకుంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకి గాను నేషనల్ అవార్డు సైతం దక్కిందంటే ఈ సినిమా ఏ లెవెల్లో ఆడిందో మనందరం అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే ఈ మూవీకి సీక్వెల్ గా పుష్ప ది రూల్ అనే టైటిల్ తో రూపొందించారు. దీనికి తగ్గట్టు మూవీ యూనిట్ గ్లింప్స్, పోస్టర్ రిలీజ్ చేస్తూ మరింత అంచనాలను పెంచారు.

Pushpa 2 title song steps composed dance master

ఇక తాజాగా నిన్న పుష్ప 2 సినిమా నుంచి పుష్ప పుష్ప అంటూ సాగే టైటిల్ సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే లిరికల్ సాంగ్ విడుదల చేసిన అల్లు అర్జున్ వేసిన ఓ డ్యాన్స్ స్టెప్ ని కూడా రిలీజ్ చేశారు. గతంలో పుష్ప సినిమాలో శ్రీవల్లి సాంగ్ లో నటిస్తూ చెప్పు వదిలేసి స్టెప్ ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ పుష్ప 2 టైటిల్ సాంగ్ లో షూ వదిలేసి వేసే స్టెప్ వైరల్ అవుతుంది. ఇక అల్లు అర్జున్ డాన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.

Also Read: Mouth Ulcers: నోటి అల్సర్లను దూరం చేసే నాచురల్ టిప్స్ ఇవే..!

ఎంతటి కష్టమైనా స్టెప్ అయినా ఈజీగా పట్టేస్తూ తనదైన శైలిలో ఆ స్టెప్పును మళ్ళీ ఇస్తాడు. అలాగే ఈ షూ స్టెప్ కూడా ఫుల్ అదరగొడుతుంది. దీంతో బన్నీ అభిమానులు స్టెప్స్ అదిరిపోయాయంటూ కామెంట్స్ చేస్తున్నారు కూడా. పుష్ప 2 సినిమాకు ప్రేమ్ రక్షిత్, గణేష్ ఆచార్య, విజయ్ పోలాకి, శ్రేష్టి వర్మలు డాన్స్ మాస్టర్స్ గా ఉన్నారు. అయితే పుష్ప టైటిల్ సాంగ్ లోను స్టెప్ కంపోజ్ చేసింది మాత్రం విజయ్ పోలాకి మాస్టర్. విజయ్ పోలాకి ఇటీవల వరసగా మంచి సినిమాలతో ఫామ్ లోకి వచ్చాడు.

Pushpa 2 title song steps composed dance master

బేబీ మరియు మ్యాడ్, బబుల్ గమ్ సహా ఇతర సినిమాలకి ఈయన స్టెప్స్ కంపోజ్ చేశాడు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ తో పుష్ప లో హైలెట్ అయ్యే స్టెప్ వేయించాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ వేసిన ఈ ఒక్క స్టెప్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఇక ఈ మూవీ అనంతరం ఈ డాన్స్ మాస్టర్ రేంజ్ పూర్తిగా మారిపోతుందనే చెప్పుకోవచ్చు. పుష్ప రాజ్ సినిమాకే డాన్స్ కంపోస్ట్ చేశాడు అంటే మామూలు విషయం కాదు. అటువంటిది బన్నీ స్టెప్స్ కూడా ప్రేక్షకులకి ఎంతగానో నచ్చాయి. దీంతో ఈయన గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు.(Pushpa 2)

Join WhatsApp