Raj Tarun doesn't want to get married

Raj Tarun: కుమారి 21ఎఫ్ మూవీ తో ఓవర్ నైట్ లో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగారు రాజ్ తరుణ్. ఇక ఈయన చేసిన ఉయ్యాల జంపాల, కుమారి 21ఎఫ్,సినిమా చూపిస్త మావా వంటి వరుస సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.కానీ ఆ తర్వాత సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు, ఆడోరకం ఈడోరకం, అందగాడు, లవర్, ఒరేయ్ బుజ్జిగా, కిట్టు గాడు ఉన్నాడు జాగ్రత్త వంటి సినిమాలు అంతగా హిట్ కాలేదు.

Raj Tarun doesn’t want to get married

దాంతో ఈయనసినీ గ్రాఫ్ ఇండస్ట్రీలో తగ్గిపోయింది.ఇక రాజ్ తరుణ్ రీసెంట్ గా నా సామి రంగ మూవీలో ఓ కీలక పాత్రలో నటించారు.. అయితే అలాంటి రాజ్ తరుణ్ ప్రస్తుతం వరుస సినిమాలు,వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజ్ తరుణ్ సంచలన కామెంట్స్ చేశారు.ఆయన మాట్లాడుతూ.. అసలు నేను జీవితంలో పెళ్లే చేసుకోను.నాకు పెళ్లి పిల్లలు ఎవరూ వద్దు.. నేను జీవితాంతం సింగిల్గానే ఉంటాను. (Raj Tarun)

Also Read: Nidhhi Agerwal: నిధి అగర్వాల్ ని మోసం చేసి మరో అమ్మాయి ప్రియుడు ఎఫై**..బ్రేకప్ చెప్పిన హీరోయిన్..!

అయితే మొదట్లో మా అమ్మ పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టేది. కానీ మా అమ్మ నాన్న ప్రస్తుతం నా ఇష్టానికే వదిలేశారు.. అంటూ సంచలన కామెంట్స్ చేశారు రాజ్ తరుణ్.దీంతో ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియా లో వైరల్ అవ్వడంతో ఇదేంటి రాజ్ తరుణ్ ఇలా మాట్లాడారు. అసలు జీవితంలో పెళ్లే చేసుకోను అని ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నారు ఏంటి.. అని ఆశ్చర్యపోతున్నారు. ఇక మరికొంతమందేమో రీసెంట్ గా డ్ర** కేసులో పట్టుబడిన ఒక అమ్మాయి రాజ్ తరుణ్ లవర్ అంటూ ఓ రూమర్ మీడియా లో చక్కర్లు కొట్టిన సంగతి మనకు తెలిసిందే..

Raj Tarun doesn't want to get married

అయితే ఇందులో ఎంత నిజమో తెలియదు కానీ ఆ అమ్మాయితో ప్రేమలో ఉండి మోసపోయిన రాజ్ తరుణ్ మళ్ళీ ఏ అమ్మాయితో కూడా తన జీవితాన్ని షేర్ చేసుకోకూడదు అనుకున్నారని, అందుకే ఆయనకు ప్రేమ పెళ్లి మీద విరక్తి పుట్టిందని కొంతమంది ఈ వార్త వైరల్ చేస్తున్నారు. అయితే రాజ్ తరుణ్ తీసుకున్న నిర్ణయం ఎప్పటికీ అలాగే ఉంటుందా లేదా పోను పోనూ తన నిర్ణయం మార్చుకొని పెళ్లి పీటలు ఎక్కుతారా అనేది తెలియాల్సి ఉంది.(Raj Tarun )

Join WhatsApp