Rajamouli comments on Anil ravipudi

Rajamouli: టాలీవుడ్ ఇండస్ట్రీకి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన దిగ్గజ ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. పాన్ ఇండియా సినిమా అంటే ఏంటో టాలీవుడ్ కి పరిచయం చేశాడు ఈ డైరెక్టర్. తన కెరీర్ లో ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇక రీసెంట్ గా త్రిబుల్ ఆర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జక్కన్న నేషనల్ అవార్డు సైతం దక్కించుకున్నాడు. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ సంచలనం క్రియేట్ చేసింది. అటువంటి సినిమా అనంతరం జక్కన్న ఏ సినిమా తీయబోతున్నాడు అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరు లోను నెలకొంది. ఇక తన తదుపరి చిత్రాన్ని జక్కన్న మహేష్ బాబుతో తీయనున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు.

Rajamouli comments on Anil ravipudi

ఇటీవల గుంటూరు కారం మూవీ తో ప్రేక్షకుల ముందుకి వచ్చిన మహేష్ బాబు మిక్డ్‌ టాక్ అంతం చేసుకున్నాడు. దీంతో మహేష్ నెక్స్ట్ మూవీ పై భారీ హైప్స్ ఏర్పడ్డాయి. ఇక రాజమౌళి దర్శకత్వంలో సినిమా అంటే పక్క సూపర్ హిట్ అయిపోయినట్లే. ఆచితూచి అడుగులు వేసే జక్కన్న తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్లో పాల్గొన్నాడు. ఇక ఈ ప్రమోషన్స్లో మరో డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా పాల్గొన్నారు. ఇక తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Mahesh Babu: పాన్ ఇండియా సినిమాలు తీయకముందే టాప్ హీరోలలో సెకండ్ ప్లేస్ కొట్టేసిన మహేష్.. చిరంజీవికి ఘోర అవమానం..!

అనిల్ రావిపూడి ప్రశ్నకి దిమ్మతిరిగే కౌంటర్ వేశాడు రాజమౌళి. ఇక ఈ విషయాల వివరాల్లోకి వెళితే.. అనిల్ రావిపూడి మాట్లాడుతూ..” నేను స్పీచ్ ముగించే ముందు ఓ రెండు కోరికలు కోరుకుంటా. ఒకటి కొరటాల శివ గారి స్పీచ్ లో దేవర రిలీజ్ డేట్ చెప్తారని? అండ్ రెండోది రాజమౌళి స్పీచ్ లో ఓపెనింగ్ డే ఎప్పుడు? ఓపెనింగ్ రోజు ఆయన సినిమా కథ చెబుతాడు. అసలు ఏ జోనర్? ఏ సినిమా తీస్తున్నారు అనే తెలుసుకోవాలని చాలా ఎక్సైటింగ్ గా ఉంది.

Rajamouli comments on Anil ravipudi

ఆ రెండు చెబుతారని కోరుకుంటున్నా ” అంటూ స్పీచ్ ముగించాడు అనిల్ రావిపూడి. ఇక ఈయన వ్యాఖ్యలకి రాజమౌళి స్పందిస్తూ..” నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా సరే ఒక కెమెరా పట్టుకుని.‌. వెనకాలే నడుస్తూ.. ఇంకొకళ్ళు అనిల్ రావిపూడి మీద ముసుగు వేసి గుద్దేస్తే.. వారికి పది వేలు ఇస్తా ” అంటూ దిమ్మతిరిగే కౌంటర్ వేశాడు జక్కన్న. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోని చూసిన పలువురు.‌.‌.‌ రాజమౌళి షేక్స్.. అనిల్ రావిపూడి షాక్స్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.(Rajamouli)

Join WhatsApp