Rajinikanth Thalaivar171 title

Thalaivar171: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేయాలనీ చాలామంది హీరో లు వెయిటింగ్ లో ఉంది. తాజాగా ఆయన చేసిన లియో తర్వాత ఇప్పుడు రజనీకాంత్ తో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం తన 170 వ సినిమా చేస్తున్న రజినీ ఇప్పుడు తన 171వ సినిమా అనౌన్స్మెంట్ చేశాడు. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నట్లు సమాచారం. ఇటీవల, మేకర్స్ ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్‌ను విడుదల చేసారు, ఇది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

Thalaivar171 Film Title Teaser Released

కాగా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించి టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కాగా ఈ చిత్రానికి ‘కూలీ’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ టీజర్ తప్పకుండా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుందని చెప్పాలి. మాస్ ఇమేజ్ ఉన్న రజినీ ని ఈ అవతారంలో చూసి చాలా రోజులైంది. మంచి కథ తోడైతే రికార్డులు గల్లంతులవడం ఖాయం అని చెప్పాలి. ఇన్ని రోజులు డ్రగ్స్ మాఫియా చుట్టూ తిరిగే కథతో సినిమాలు చేసిన లోకేష్ కనగరాజ్ ఇప్పుడు రూట్ మార్చినట్లు తెలుస్తుంది.

ఈ సినిమాను గోల్డ్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకేక్కిస్తున్నాడని టీజర్ ను చూస్తే తెలిసింది. మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ యాక్షన్ క్లిప్‌ల రూపంలో ప్రేక్షకుల ముందుకు రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. లోకేష్ కనకరాజ్ చాలా సినిమాలు చేయాల్సి ఉండగా రజినీ తో సినిమా చేయడం పెద్ద విశేషం అనే చెప్పాలి.

Join WhatsApp