Rakul and Jackky Bhagnani total property

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్,జాకీ భగ్నాని మరికొద్ది గంటల్లో మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు.. ఈ జంట గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉండి చివరికి ఒకరిని ఒకరు పూర్తిగా అర్థం చేసుకున్నాక పెళ్లి పీటలెక్కుతున్నారు. ఇక ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. వీరి పెళ్లికి ఖరీదైన బట్టలు మొదలు పెళ్లికి వచ్చే అతిధులకు కూడా ఆరోగ్యకరమైన విందును అందించ బోతున్నారట.అలాగే పర్యావరణం కలుషితం కాకుండా క్రాకర్స్ వంటి వాటిని వీరు పెళ్లిలో వినియోగించడం లేదట. అంతేకాకుండా వీరి పెళ్లిరోజు మొక్కల్ని కూడా నాట బోతున్నారట.

Rakul Preet Singh and Jackky Bhagnani total property

అయితే వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్న రకుల్ ప్రీత్ సింగ్ జాకి భగ్నానీలకు సంబంధించి మరొక న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే వీరిద్దరి ఆస్తి మొత్తం ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా అంటూ ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఒక ప్రముఖ వెబ్సైట్ రాసిన దాని ప్రకారం వీరి ఆస్తి దాదాపు 90 కోట్లు ఉన్నట్టు తెలుస్తోంది..ఇక వీరిద్దరి ఆస్తుల్లో ఎక్కువ ఆస్తిపాస్తులు రకుల్ ప్రీత్ సింగ్ దగ్గరే ఉన్నాయట.. రకుల్ తన ఒక్కో సినిమాకి మూడు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.(Rakul Preet Singh)

Also Read: Vishwak Sen: ఆ హీరో వ‌ల్ల చాలా న‌ష్ట‌పోయా.. బ్యాక్‌గ్రౌండ్ లేని బచ్చాగాడిననే అలా చేశారంటూ విశ్వ‌క్ సేన్ ఫైర్‌!

అలాగే ఆమె దగ్గర ఖరీదైన కార్లు కోట్ల విలువ చేసే ఫ్లాట్లు కూడా ఉన్నాయి.. రకుల్ కి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో అలాగే ముంబైలోని పలు ప్రాంతాల్లో అలాగే వైజాగ్,ఢిల్లీ వంటి ప్రాంతాల్లో కూడా ఖరీదైన స్థలాలు ఉన్నాయట.అంతేకాకుండా 35 లక్షల ఖరీదు చేసే ఆడి క్యూ 3, కోటి రూపాయల విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ GLE,2.96 కోట్ల విలువ చేసే మెర్సిడెస్ Maybach GLS600,75 లక్షల ఖరీదు చేసే బీఎండబ్ల్యూ 520D, 70 లక్షల విలువ చేసే రేంజ్ రోవర్ స్పోర్ట్స్ వంటి ఖరీదైన కార్లు ఈమె దగ్గర ఉన్నాయట.

Rakul and Jackky Bhagnani total property

ఇక బాలీవుడ్ లో నిర్మాతగా.. నటుడుగా.. రాణిస్తున్న జాకీ భాగ్నాని దగ్గర దాదాపు 38 కోట్ల ఆస్తిపాస్తులు ఉన్నాయట. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ దగ్గర ఉన్న ఆస్తి విలువ దాదాపు 52 కోట్లని తెలుస్తోంది. ఇక మొత్తంగా వీరిద్దరి ఆస్తి కలిపితే 90 కోట్లు ఉండొచ్చని అంచనా.. ఇక రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో రాణిస్తుందని తెలుస్తోంది. ఈ మధ్యనే రకుల్ శివ కార్తికేయన్ తో చేసిన అయిలాన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలాగే ఈమె చేతిలో కమల్ హాసన్ ఇండియన్ 2,మరో హిందీ మూవీ కూడా ఉంది.(Rakul Preet Singh)

Join WhatsApp