Rakul Preet Singh and Jackky Bhagnani's Wedding Video Here

Rakul Preet Singh: ప్ర‌ముఖ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఓ ఇంటిది అయిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ న‌టుడు, నిర్మాత జాకీ భ‌గ్నానీతో ర‌కుల్ పెళ్లి పీట‌లెక్కింది. దాదాపు మూడేళ్ల‌ నుంచి ల‌వ్ లో ఉన్న ఈ జంట‌.. ఫిబ్ర‌వ‌రి 21న ద‌క్షిణ గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్టులో అత్యంత వైభవంగా వివాహం చేసుకున్నారు. పంజాబీ ఆనంద్ కరాజ్, సింధి సంప్రదాయల్లో వీరి వెడ్డింగ్ జ‌రిగింది. కుటుంబ‌స‌భ్యులు, స‌న్నిహితులే కాకుండా బాలీవుడ్ కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు సైతం ర‌కుల్‌-జాకీ పెళ్లిలో సంద‌డి చేశారు.

Rakul Preet Singh and Jackky Bhagnani’s Wedding Video Here

అక్ష‌య్ కుమార్, శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా, ఆయుష్మాన్ ఖురానీ, అర్జున్ కపూర్, డేవిడ్ ధావన్‍, అన‌న్య పాండేతో స‌హా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. అలాగే అభిమానులు, మ‌రికొంద‌రు సినీ తార‌లు సోష‌ల్ మీడియా ద్వారా ర‌కుల్‌-జాకీ దంప‌తుల‌కు విషెస్ తెలిపారు. ఫిబ్ర‌వ‌రి 19 నుంచే వీరి పెళ్లి హ‌డావుడి ప్రారంభం అయింది. హ‌ల్దీ, మెహందీ, సంగీత్ వంటి ఫంక్ష‌న్స్ ను గ్రాండ్ గా నిర్వ‌హించారు.

ఇప్ప‌టికే ర‌కుల్ ప్రీత్ సింగ్‌, జాకీ భ‌గ్నానీ వెడ్డింగ్ పిక్స్ నెట్టింట వైర‌ల్ అయ్యాయి. అయితే తాజాగా ఈ కొత్త జంట త‌మ పెళ్లికి సంబంధించిన కొన్ని క్యూట్ మూమెంట్స్ ను ఓ వీడియోలో బంధించి సోష‌ల్ మీడియా ద్వారా పంచుకున్నారు. హ‌ల్దీ, మెహందీ, సంగీత్‌, వెడ్డింగ్‌.. ఇలా అన్నిటిని క‌వ‌ర్ చేస్తూ ఈ వీడియోను రూపొందించారు. ప‌చ్చ‌ని ప్ర‌కృతి న‌డుమ పెళ్లి దుస్తుల్లో ర‌కుల్ ప్రీత్ సింగ్, జాకీ భ‌గ్నానీ అందంగా మెరిసిపోతూ క‌నిపించారు.(Rakul Preet Singh)

Also Read: Srikanth: శ్రీ‌కాంత్ కు చెల్లెలుగా ఆపై భార్య‌గా న‌టించిన ఏకైక హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

ర‌కుల్‌-జాకీ షేర్ చేసిన పెళ్లి వీడియోను చూడ‌టానికి రెండు క‌ళ్లు చాల‌వు. అంత అద్భుతంగా ఉంది. కాగా, ర‌కుల్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఇటీవ‌ల అయలాన్ మూవీతో త‌మిళ ప్రేక్ష‌కులను ప‌ల‌క‌రించింది. జ‌న‌వ‌రి ఆఖ‌రి వారంలో విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం ర‌కుల్ హిందీలో మేరీ పత్నీ కా రీమేక్‌లో నటిస్తోంది. అలాగే కోలీవుడ్ లో క‌మ‌ల్ హాస‌న్ తో శంక‌ర్ డైరెక్ష‌న్ లో ఇండియ‌న్ 2లో న‌టిస్తోంది. మ‌రోవైపు జాకీ భగ్నానీ నిర్మాతగా వ్యవహరించిన బడే మియా చోటే మియా చిత్రం విడుద‌ల‌కు రెడీ అవుతోంది.

Join WhatsApp