Rakul Preet Singh Changed Her Wedding Venue

Rakul Preet Singh: ఇటీవ‌ల కాలంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కు సినీ తార‌లు వ‌రుస పెట్టి పెళ్లి పీట‌లెక్కిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఇండ‌స్ట్రీలో మ‌రోసారి పెళ్లి భాజాలు మోగ‌బోతున్నాయి. సౌత్‌లో స్టార్ ఇమేజ్ సంపాదించుకుని.. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో ప‌గా వేసేందుకు క‌ష్ట‌ప‌డుతున్న ర‌కుల్ ప్రీత్ సింగ్ ఈ నెల‌లోనే ఓ ఇంటికి కాబోతోందట‌. బాలీవుడ్ న‌టుడు, నిర్మాత జాకీ భగ్నానీతో కొన్నేళ్ల నుంచి ర‌కుల్ ల‌వ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. రెండేళ్ల క్రిత‌మే ఈ జంట త‌మ రిలేష‌న్ ను రివీల్ చేశారు.

Rakul Preet Singh Changed Her Wedding Venue

అయితే త‌మ బంధాన్ని మ‌రింత ముందుకు తీసుకెళ్లాల‌ని భావిస్తున్న ర‌కుల్ ప్రీత్ సింగ్ మ‌రియు జాకీ భగ్నానీ.. పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఫిబ్ర‌వ‌రి 22న వీరి వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌బోతోంద‌ని అంటున్నారు. ఇప్ప‌టికే పెళ్లి ప‌నులు కూడా ప్రారంభం అయ్యాయ‌ట‌. పెళ్లికి మ‌రో ఇర‌వై రోజులే ఉంది.. ఇంత‌లో ర‌కుల్ స‌డెన్ గా యూట‌ర్న్ తీసుకుంది. వెడ్డింగ్ వెన్యూను మార్చేశారు.

మొద‌ట విదేశాల్లో డెస్టినేష‌న్ వెడ్డింగ్ చేసుకోవాల‌ని ర‌కుల్ మ‌రియు జాకీ భావించారు. కానీ, తాజాగా ఆ నిర్ణ‌యాన్ని మార్చుకున్నారు. ప‌లు నివేదిక‌ల ప్ర‌కారం.. మిడిల్ ఈస్ట్ లో వివాహం చేసుకునేందుకు ర‌కుల్ త‌న ప్రియుడితో క‌లిసి దాదాపు ఆరు నెలల పాటు పక్కా ప్లానింగ్ వేసింది. అయితే ఆఖ‌రి నిమిషంలో వారు మ‌న‌సు మార్చుకున్నారు. విదేశాల్లో కాకుండా గోవాలో పెళ్లి చేసుకోవాల‌ని ర‌కుల్ ప్రీత్ సింగ్ మ‌రియు జాకీ భగ్నానీ నిర్ణ‌యించుకున్నారు.(Rakul Preet Singh)

Also Read: Prasanth Varma: హ‌నుమాన్ గ్రాండ్ స‌క్సెస్‌.. డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ‌కు నిర్మాత ఖ‌రీదైన‌ గిఫ్ట్‌!?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీనే ఇందుకు కార‌ణం. సంప‌న్న కుటుంబాలకు, సెలబ్రిటీల‌కు గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో మోదీ ఒక పిలుపునిచ్చారు. భార‌తీయ యువ జంట‌లు త‌మ నూత‌న ప్ర‌యాణాన్ని విదేశాల్లో కాకుండా ఇండియాలో ప్రారంభించాల‌ని, స్వ‌దేశంలోనే వివాహం చేసుకోవాల‌ని సూచ‌న చేశారు. మేకిన్ ఇండియా త‌ర‌హాలో వెడ్ ఇన్ ఇండియా స్టార్ట్ కావాల‌ని పిలుపునిచ్చారు. అలాగే తన జీవితాల్లో ఇత‌ర‌ ముఖ్యమైన ఈవెంట్లను కూడా ఇండియా వేదికగానే జరుపుకోవాలని కోరారు. మెదీ పిలుపుతో ర‌కుల్, జాకీ జంట విదేశాల్లో కాకుండా స్వ‌దేశంలోనే ఏడ‌డుగులు వేయాల‌ని ఫిక్స్ అయ్యారు. త‌మ వెడ్డింగ్ వెన్యూను గోవాకు షిఫ్ట్ చేశారు.

Join WhatsApp