Ram Charan First Crash

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి భార్య ఉపాసన కంటే ఆ ఇద్దరు హీరోయిన్స్ అంటేనే పిచ్చి ఇష్టమట.. మరి ఇంతకీ రామ్ చరణ్ మెచ్చిన ఆ హీరోయిన్స్ ఎవరు.. ఉపాసన కంటే వాళ్ళు బాగుంటారా అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.. రామ్ చరణ్ కి ఇష్టమైన హీరోయిన్లు అంటే మన ఇండియన్ హీరోయిన్లు కాదు హాలీవుడ్ హీరోయిన్లట.. మరి వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం..

Ram Charan First Crash

రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ రేంజ్ కి ఎదిగారు.ఈయన గత ఏడాది ఆస్కార్ అవార్డు వచ్చిన సమయంలో ఎన్నో హాలీవుడ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చి తెలుగు వాడి సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. అయితే అలా ఓ హాలీవుడ్ ఆన్ లైన్ షో లో పాల్గొన్న సమయంలో రామ్ చరణ్ కి ఎన్నో రకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. అందులో భాగంగానే మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు అని అడగగా.. నాకు ఒకరు కాదు ఇద్దరు ఇష్టమైన హీరోయిన్లు ఉన్నారు.(Ram Charan )

Also Read: Pavan Kalyan: తాటతీసి మోకాళ్ళ మీద నడిపిస్తాం.. పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..!

వాళ్ళు కూడా హాలీవుడ్ హీరోయిన్స్ అని సమాధానం ఇచ్చారు. ఇక వాళ్ళు ఎవరంటే.. జూలియా రాబర్ట్, కేథరిన్ జెటా జోన్స్ అనే ఇద్దరు హాలీవుడ్ హీరోయిన్స్ అంటే రామ్ చరణ్ కి పిచ్చి ఇష్టమట..ప్రెట్టీ ఉమెన్ అనే మూవీ తో జూలియా రాబర్ట్ కి పెద్ద ఫ్యాన్ అయిపోయాడట రామ్ చరణ్. అలాగే వీరి సినిమాల్లో వీరి నటన చూస్తే కల్లార్పకుండా అలాగే చూస్తూ ఉంటారట రామ్ చరణ్.

Ram Charan First Crash

అలా ఈ ఇద్దరు హీరోయిన్లు తన ఫస్ట్ క్రష్ అని రామ్ చరణ్ చెప్పుకోచ్చారు. ఇక రాంచరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీ విడుదల చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమాలో కియారా అద్వాని, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అంతేకాకుండా ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా రీసెంట్ గానే జరిగాయి.(Ram Charan )

Join WhatsApp