Game Changer and OG

Game Changer Vs OG: ఈ సెప్టెంబర్ నెల మెగా ఫ్యాన్స్ కి పండగ అనే చెప్పాలి. ఏకంగా రెండు భారీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. రామ్ చరణ్ హీరో గా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా ను సెప్టెంబర్ 5 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు శంకర్ ఈ సినిమా ను ఆ టైం కల్లా పూర్తి చేయాలనీ ఫ్యాన్స్ చెప్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా లో ఈ సినిమా గురించి వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి.

Ram Charan Game Changer vs. Pawan Kalyan OG

ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఒజీ సినిమా కూడా సెప్టెంబర్ 27 న విడుదల చేసేందుకు నిర్మాత దానయ్య రంగం సిద్ధం చేస్తున్నాడు. దాదాపు ఇదే ఖరారు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సుజిత్ దర్శకత్వంలో రాబోయే ఈ సినిమా కోసం చాలామంది సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వచ్చిన టీజర్ సాంగ్ ప్రేక్షకులను వేరే స్థాయి లో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం అందరు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.(Game Changer)

Also Read: OnePlus 12: ఇండియాలో నేటి నుంచి స్టార్ట్‌ కానున్న వ‌న్‌ప్ల‌స్ 12 సేల్స్‌.. ఇలా కొంటే రూ. 12 వేలు డిస్కౌంట్‌!

ఇలాంటి సమయంలో ఈ సినిమా విడుదల తేదీ బయటకు రావడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశం అయ్యింది. పవన్ కళ్యాణ్ నటించే పలు సినిమాలు హోల్డ్ లో ఉన్నాయి. అలాంటిది ఈ సినిమా గురించి ఇంత చర్చ చేయడం నిజంగా పవన్ అభిమానులను అలరించేదే. ఇకపోతే మెగా అభిమానులు ఎప్పటినుంచి ఎదురుచూస్తున్న ఈ సినిమా రావడం వారికీ పండగ లాంటిదే.

game changer
Join WhatsApp