Ram Charan Loved that Married Heroine

Ram Charan: రామ్ చరణ్ ఉపాసన కంటే ముందే ఆ హీరోయిన్ ప్రేమించారా.. అందుకే ఆ హీరోయిన్ పై ప్రేమతో అలాంటి పని చేశారా..అంటే ఈ విషయం తెలిసిన వాళ్ళు నిజమే అంటున్నారు. మరి ఇంతకీ రామ్ చరణ్ ఉపాసన కంటే ముందే ప్రేమించిన ఆ హీరోయిన్ ఎవరు అనేది చూస్తే..రామ్ చరణ్ ప్రేమిస్తున్నట్టు వార్త వైరల్ అవుతున్న ఆ హీరోయిన్ ఎవరో కాదు కాజల్ అగర్వాల్.. ఇక రామ్ చరణ్ అప్పట్లో కాజల్ ని గాఢంగా ప్రేమించారట. అంతేకాదు కాజల్ మీదున్న ప్రేమతో తన ప్రతి సినిమాలో కాజల్ అగర్వాల్ నే తీసుకునే వారట. రామ్ చరణ్ చిరుత మూవీ తర్వాత మగధీర సినిమా చేశారు.ఈ సినిమాతోనే కాజల్ కి,రామ్ చరణ్ కి స్టార్ ఇమేజ్ వచ్చింది.

Ram Charan Loved that Married Heroine

అయితే ఈ సినిమాలో వీరి జోడికి మంచి గుర్తింపు కూడా లభించింది. అయితే ఈ సినిమా చేసే సమయంలో రామ్ చరణ్ కి కాజల్ పై ఇష్టం పెరిగిపోయిందట. దాంతో తాను చేయబోయే సినిమాలన్నింటికీ హీరోయిన్ గా కాజల్ నే ముందుగా సజెస్ట్ చేసేవారట.అలా కాజల్,రామ్ చరణ్ కాంబినేషన్లో మెరుపు సినిమా పూజ కార్యక్రమాలు చేసుకుని ఆగిపోయిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమాలో కూడా కాజల్ ని తీసుకోమని దర్శకుడికి చెప్పింది రాంచరణ్ నట. అలాగే వీరి కాంబినేషన్లో నాయక్,గోవిందుడు అందరివాడేలే వంటి సినిమాలు కూడా వచ్చాయి. అలాగే ఎవడు సినిమాలో కూడా అల్లు అర్జున్ కు జోడిగా కాజల్ ని తీసుకోవాలని మూవీ మేకర్స్ కి రామ్ చరణే చెప్పారట.

Also Read: Chiranjeevi: చిరంజీవి- దాసరి నారాయణరావు గారికి మధ్య విభేదాలు రావడానికి కారణం..?

ఈ సినిమాలు మాత్రమే కాకుండా తన తండ్రి రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమాలో కూడా కాజల్ ని హీరోయిన్ గా తీసుకోమని చిరంజీవికి చెప్పింది రాంచరణ్ నట.అలాగే ఆచార్య సినిమాలో కూడా రామ్ చరణ్ చెప్పినట్లు కాజల్ ని చిరంజీవికి జోడిగా తీసుకున్నారట.కానీ కొన్ని కారణాల వల్ల ఆచార్య మూవీలో కాజల్ సన్నివేశాలు అన్ని డిలీట్ చేశారు. ఇలా రామ్ చరణ్ అప్పట్లో తన చేయబోయే సినిమాలన్నింటిలో కాజలే తన పక్కన ఉండాలి అనుకునేవారట. కానీ ఆ తర్వాత రామ్ చరణ్ మైండ్ సెట్ మారిపోయిందట. అందుకే ఇప్పుడు కాజల్ ని ఎక్కువగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

Ram Charan who loved that married heroine

కానీ రీసెంట్ గా ఫిలిం ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఓ టాక్ ప్రకారం..చిరంజీవి విశ్వంభర మూవీ లో కూడా కాజల్ ని తీసుకోమని మూవీ యూనిట్ కి రామ్ చరణ్ చెప్పారట.మరి ఈ సినిమాలో రామ్ చరణ్ కోరిక మేరకు కాజల్ ని తీసుకుంటారా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది.అయితే ఇన్ని సినిమాల్లో రామ్ చరణ్ కాజల్ ని రికమండ్ చేయడం వల్ల చాలామంది వీరి మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ నడుస్తోంది అని భావించారు.కానీ కాజల్ తో ఇన్ని సినిమాల్లో నటించడం వల్ల రామ్ చరణ్ కి ఆమెపై మంచి నమ్మకం ఏర్పడిందట.అంతేకాదు కాజల్ యాక్టింగ్ కి రామ్ చరణ్ ఫిదా అయ్యే ఇన్ని సినిమాలకు కాజల్ ని రికమెండ్ చేసినట్లు తెలుస్తోంది.(Ram Charan)

Join WhatsApp