Ram Charan warning that director

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ టాలీవుడ్ డైరెక్టర్ కి నిజంగానే వార్నింగ్ ఇచ్చారా.. ఆ డైరెక్టర్ సినిమాని వాయిదా వేయమని ఎందుకు వార్నింగ్ ఇచ్చారు..ఆ మూవీ తన మూవీకి పోటీగా రిలీజ్ అయితే తన సినిమా ప్లాఫ్ అవుతుందని రామ్ చరణ్ భయపడ్డారా.. ఎందుకు అలా వార్నింగ్ ఇచ్చారు అనేది ఇప్పుడు చూద్దాం.. ప్రస్తుతం రామ్ చరణ్ ఇండస్ట్రీలో గ్లోబల్ రేంజ్ ఉన్న హీరో..

Ram Charan warning that director

ఆర్ఆర్ఆర్ మూవీ తో ఈయన టాలీవుడ్ లో మంచి స్థానంలోకి వెళ్లారు. అయితే అలాంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరిలేరు నీకెవ్వరు,ఎఫ్2 ఎఫ్3, రాజా ది గ్రేట్,సుప్రీమ్,పటాస్, భగవంత్ కేసరి వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడి కి వార్నింగ్ ఇచ్చారట.ఇక ఈయన దర్శకత్వం వహించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్సే..

Also Read: 20Years Of Arya: ఆర్య మూవీ కి ఫస్ట్ ఛాయిస్ అల్లు అర్జున్ కాదా.. ఆ స్టార్ హీరోనా..?

అయితే అలాంటి ఈ డైరెక్టర్ కి రామ్ చరణ్ వార్నింగ్ ఎందుకు ఇచ్చారంటే.. ఓ ఈవెంట్లో రామ్ చరణ్ అనిల్ రావిపూడి సరదాగా ఎదురుపడ్డారట. అలా ఎదురుపడ్డ సమయంలో సంక్రాంతి కానుకగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఎఫ్2, రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమాలు రెండు విడుదలయ్యాయి.అయితే ఈ సినిమా విడుదలయ్యే ముందు ఓ ఈవెంట్లో అనిల్ రాంచరణ్ ఎదురుపడగా నా సినిమాకి ఆపోజిట్ గా నీ సినిమాని రిలీజ్ చేస్తున్నావా అంటూ వార్నింగ్ ఇస్తున్నట్లు అడిగారట.

Ram Charan warning that director

దాంతో అనిల్ రావిపూడి కాస్త భయపడి పోయి అలాగే చూశారట.ఆ తర్వాత రాంచరణ్ సరదాగా అన్నాను నీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి అంటూ అనిల్ ని హగ్ చేసుకుని మరీ మనస్ఫూర్తిగా చెప్పారట.ఇక సంక్రాంతి బరిలోనిలిచిన ఈ రెండు సినిమాల్లో వినయ విధేయ రామ సినిమా ప్లాప్ అయ్యింది ఎఫ్2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.(Ram Charan )

Join WhatsApp