Ram Charan who beat Pawan Kalyan's place

Pawan Kalyan: తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ పాపులారిటీ ఉన్న హీరోలలో మెగాస్టార్ రామ్ చరణ్ కూడా ఒకరు. చిరంజీవి వారసత్వాన్ని అందుపుచ్చుకుంటూ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన చెర్రీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఈ మధ్యకాలంలో అయితే వరుసగా హ్యాట్రిక్ హీట్లను తన ఖాతాలో వేసుకుంటూ గ్లోబల్ స్టార్ గా కూడా తన టాగ్ ను మార్చుకున్నాడు. ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Ram Charan who beat Pawan Kalyan’s place

ఈ మూవీ ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా దీనిపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అందుకే ఈ సినిమా మరింతగా ఆలస్యం అవుతుంది. నిజానికి గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ 2021 లోనే ప్రారంభం అయ్యింది. దీన్ని 223లో విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు కూడా. ఇక తరువాత 2024 సంక్రాంతికి తీసుకు వచ్చే ప్లాన్ వేశారు.

Also Read: Prabhas: పిచ్చి అభిమానంతో నగ్నంగా అక్కడ డార్లింగ్ టాటో వేపించుకున్న ఫ్యాన్ గర్ల్.. ఫొటోస్ వైరల్..!

కానీ అనివార్య కారణాలవల్ల చిత్రీకరణ లేట్ అవ్వడంతో ఈ మూవీ విడుదలపై ప్రభావం పడింది. ఫలితంగా అసలు ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అనే దానిపై అయోమయం ఏర్పడింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. శంకర్ కలయికలో రూపొందుతున్న గేమ్ చేంజర్ మూవీ కి సంబంధించి షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతుంది. ఇక దీని తరువాత ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా వరుసగా షెడ్యూల్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఇలా వీలైనంత త్వరగానే షూటింగ్ కంప్లీట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది చిత్ర యూనిట్.

Ram Charan who beat Pawan Kalyan's place

ఇక ఈ మూవీ ని ఏడాది డిసెంబర్లో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీని సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేయనున్నారట. దీనిపై మరికొద్ది రోజుల్లోనే అధికారక ప్రకటన కూడా రాబోతుంది. వాస్తవానికి అదే రోజున పవన్ కళ్యాణ్ ఓజి రిలీజ్ ప్లాన్ చేశారు. అప్పటి కి ఈ చిత్రం వచ్చే అవకాశం లేకపోవడం వల్లే గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. అలా పవన్ కళ్యాణ్ ప్లేస్ ని చెర్రీ కొట్టేశాడు.(Pawan Kalyan)

Join WhatsApp