Ram Charan's Sister Secretly Engaged with Boyfriend

Ram Charan: ఈ మధ్యకాలంలో చాలామంది నటీ నటులు ఒకరి తర్వాత ఒకరు పెళ్లి చేసుకుంటున్నారు. అయితే పెళ్లికి సంబంధించిన విషయాన్ని ముందుగా అయితే బయట పెట్టరు. కానీ వారికి సంబంధించిన ఏదో ఒక క్లూ బయటపడడంతో వీరి పెళ్లి గురించి అనేక వార్తలు వినిపిస్తాయి. అయితే తాజాగా సినిమా ఇండస్ట్రీలోని రామ్ చరణ్ సిస్టర్ బాయ్ ఫ్రెండ్ తో సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచిందంటూ ఆమెకు సంబంధించిన ఫోటోలు కొన్ని నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

Ram Charan’s Sister Secretly Engaged with Boyfriend

ఇక రామ్ చరణ్ సిస్టర్ అంటే అందరూ నిజజీవితంలో అనుకుంటారు. ఇక రామ్ చరణ్ సిస్టర్ అంటే నిజ జీవితంలో కాదు ఆయనతో సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోయిన్. ఆమె ఎవరో కాదు కృతి కర్బందా..సౌత్,నార్త్ లో మంచి ఇమేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో బోణి, ఒంగోలు గిత్త,అలా మొదలైంది,మిస్టర్ నూకయ్య, తీన్ మార్,ఓం 3d వంటి సినిమాల్లో చేసింది. ఇక హీరోయిన్ గానే కాకుండా రామ్ చరణ్ హీరోగా వచ్చిన బ్రూస్ లీ మూవీలో రామ్ చరణ్ అక్క పాత్రలో కూడా నటించింది.

Also Read: Varalaxmi Sarathkumar: ఎట్ట‌కేల‌కు పెళ్లికి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ గ్రీన్ సిగ్న‌ల్‌.. ఆ స్టార్ హీరోతో ఏడ‌డుగులు!?

ఇక అలాంటి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ కి దూరంగా ఉండి బాలీవుడ్ లోనే రాణిస్తోంది. బాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో చేసిన కృతి కర్బందా సీక్రెట్ గా తన బాయ్ ఫ్రెండ్ తో ఎంగేజ్మెంట్ చేసుకుందంటూ ఓ వార్త బీటౌన్ లో వినిపిస్తుంది.ఇక అందుకు తగ్గట్టుగానే వారి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు బాలీవుడ్లో తెగ వైరల్ గా మారాయి. కృతికర్బంద బాలీవుడ్ నటుడు పులకిత్ సామ్రాట్ తో గత కొద్ది రోజులుగా రిలేషన్ లో ఉన్నట్టు సమాచారం.

Ram Charan's sister secretly engaged with boyfriend

అయితే వీరి రిలేషన్ గురించి బీటౌన్ లో ఎన్నో వార్తలు వినిపించినా కూడా ఆ విషయం గురించి వీరు స్పందించలేదు.కానీ తాజాగా వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారని, త్వరలోనే వీరిద్దరి పెళ్లి జరగబోతుంది అని తెలుస్తోంది. కృతికర్బంద,పులకిత్ సామ్రాట్ ఇరు కుటుంబ సభ్యులు, అలాగే కొంతమంది ఫ్రెండ్స్ మధ్య రహస్యంగా ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు.ఇక వీరికి సంబంధించిన ఆ ఫొటోస్ కొన్ని సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి.అలాగే వచ్చే నెలలో వీరిద్దరి వివాహం జరగబోతుందని సమాచారం. (Ram Charan)

Join WhatsApp