Rashi Khanna who revealed what is in her mind

Rashi Khanna: రాశిఖన్నా.. టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుత కాలంలో పెద్దగా సినిమాలు చేయకపోయినా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందచందాలను ఆరబోస్తుంది రాశికన్నా. ఒకానొక సమయంలో వరుస అవకాశాలు అందుకుంటూ హ్యాట్రిక్ హిట్లు తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పెద్దగా తెలుగు సినిమాలు చేయకపోవడంతో తన ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు.

Rashi Khanna who revealed what is in her mind

ఇక ఆ లోటును తీర్చేందుకే నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూ ట్రీట్ ఇస్తుంది. ఇక తాజాగా రాశి కన్నా ఓ వీడియోని షేర్ చేసింది. ఆ వీడియోలో నాకు ఆ స్టార్ హీరో తో నటించాలని ఉంది అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Meena: భర్త గురించి చెబుతూ కంటతడి పెట్టుకున్న సీనియర్ యాక్టర్ మీనా..!

వివరాల్లోకి వెళితే.. అభిమానులతో చిట్ చాట్ నిర్వహించిన ఈ ముద్దుగుమ్మ కి మీకు ఎవరితో వర్క్ చేయాలని ఉంది అనే ప్రశ్న ఎదురయింది. దీనికి ఈమె సమాధానం ఇస్తూ..” నాకు అందరితోనూ వర్క్ చేయాలని ఉంటుంది తలపతి విజయ్, రామ్ చరణ్, రన్బీర్ కపూర్, మహేష్ బాబు ఇలా అనేకమంది ఉంటారు. కానీ నేను ఎక్కువగా వర్క్ చేయడానికి ఇష్టపడేది షారుక్ ఖాన్ గారితో.

Rashi Khanna who revealed what is in her mind

నా జీవితంలో ఆయనతో ఒక్కసారైనా వర్క్ చేయాలనేదే నా ఆశ ” అంటూ మనసులో ఉన్న మాటను బయట పెట్టింది రాశి కన్నా. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..” పెద్ద స్టార్ కే గ్యాలం వేశావుగా. చాప చిక్కితే మరో బ్లాక్బస్టర్ పక్కా..” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.(Rashi Khanna)

Join WhatsApp