Rashmika Comment Vijay deverakonda And Marriage

Vijay Deverakonda: టాలీవుడ్ లో హీరో హీరోయిన్ ల మధ్య అఫైర్స్ అనేవి కామన్. అలా ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ ఆఫైరింగ్ కపుల్ గా ఉన్నారు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. వీరు కలిసి చేసిన మొదటి సినిమా గీత గోవిందం ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ అనే సినిమా చేయగా ఇది కూడా ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంది. అయితే ఈ రెండు సినెమాలకన్నా వీరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంది.

Rashmika Comment Vijay deverakonda And Marriage

నిజజీవితంలో లవర్స్ లాగా ఈ సినిమా లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ఎన్ని రూమర్స్ వచ్చాయో అందరికి తెలిసిందే. వీరిద్దరూ ఎంత దాయాలనుకున్నా ఎక్కడో ఒకదగ్గర వీరు కలిసే ఉన్నారన్న విషయం వెలుగులోకి వచ్చేది. అలా స్టార్ పెయిర్ గా ఉన్న వీరి పెళ్లి కూడా తొందరలోనే జరుగుతుందనే ప్రచారం జరిగింది. ఎప్పటికప్పుడు వీరిద్దరూ ఈ వార్తలను కొట్టిపడేస్తూనే ఉన్నారు.

Also Read: Monthly Income: నెలకు రూ.5500 ఇచ్చే పోస్టాఫీస్ స్కీమ్.. పూర్తి వివరాలివే..!

ఎవరి సినిమాల్లో వారు బిజీ గా ఉంటూ స్టార్ రేస్ లో ఉన్న వీరు ప్రస్తుతం పలు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియా లో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. రష్మిక ఫ్యాన్ ఒకరు రష్మిక కు రాబోయే హస్బెండ్ ఎలా ఉండాలి. విజయ్ దేవరకొండ లాగా ఉండాలి కదా.. అని కొన్ని క్వాలిటీస్ చెప్పారు. దానికి సమాధానంగా అవును తనకు అలాంటి భర్తే కావాలి అని రష్మిక రిప్లై ఇచ్చింది.

దీంతో వీరిద్దరి మధ్య ఉన్న రేలేషన్ నిజమే అని లేదంటే అలా ఎందుకు రష్మిక రిప్లై ఇస్తుందని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా రష్మిక ఇలా బహిరంగంగా చెప్పడం విజయ్ ఎలా తీసుకుంటాడో చూడాలి. తనకు కాబోయే భర్త విజయ్ లా ఉండాలి అని చెప్పడం లో తప్పు లేదు కానీ రూమర్స్ ఉన్న నేపథ్యంలో రష్మిక ఈ విధంగా జవాబివ్వడం వైరల్ గా మారింది. మరి రష్మిక జీవితంలోకి అడుగుపెట్టబోయే అతగాడు ఎవరు చూడాలి. (Vijay deverakonda)

Join WhatsApp