Rashmika Mandanna Hikes Her Remuneration

Rashmika Mandanna: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా కెరీర్ ప‌రంగా దూసుకెళ్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లె ఈ అమ్మ‌డు యానిమ‌ల్ మూవీతో బాలీవుడ్ లో ఫ‌స్ట్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ర‌ణ‌బీర్ క‌పూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెర‌కెక్కిన ఈ యాక్ష‌న్ డ్రామా.. 2023 డిసెంబ‌ర్ 1న నార్త్ తో పాటు సౌత్ భాష‌ల్లోనూ విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. అనేక వివాదాలు చుట్టుకున్నా.. బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపించింది. ర‌ణ‌బీర్ క‌పూర్ కెరీర్ లోనే హైయ్యెస్ట్ గ్రాస్ క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.

Rashmika Mandanna Hikes Her Remuneration

అయితే యానిమ‌ల్ గ్రాండ్ స‌క్సెస్ తో ర‌ష్మిక త‌న రెమ్యున‌రేష‌న్ ను మ‌రోసారి పెంచేసింద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో టాక్ న‌డుస్తోంది. పుష్ప ది రైజ్ కు ముందు వ‌ర‌కు ర‌ష్మిక రెమ్యున‌రేష‌న్ రెండు కోట్ల రేంజ్ లో ఉండేది. పుష్ప పార్ట్ 1 భారీ విజ‌యాన్ని అందుకోవ‌డంతో ర‌ష్మిక క్రేజ్ అమాంతం పెరిగింది. పాన్ ఇండియా స్టాయిలో గుర్తింపు సంపాదించుకుంది. తెలుగుతో పాటు త‌మిళ్, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లోనూ సినిమాలు చేయ‌డం స్టార్ట్ చేసింది.

అలాగే టాలీవుడ్ తో స‌హా సౌత్ సినిమాల‌కు రూ. 3 కోట్లు, బాలీవుడ్ లో చేసే చిత్రాల‌కు రూ. 4 కోట్లు చొప్పున రెమ్యున‌రేష‌న్ ఛార్జ్ చేసేది. అయితే ఇటీవ‌ల యానిమ‌ల్ రూపంలో ఆమె ఖాతాలో మ‌రో బిగ్ బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌డింది. ఈ నేప‌థ్యంలోనే బాలీవుడ్ లో ఒక్కో సినిమాకు రూ. 5 కోట్లు ఛార్జ్ చేస్తుంద‌ట‌. ఇటు టాలీవుడ్ మ‌రియు ఇత‌ర సౌత్ భాష‌ల్లో రూ. 4 నుంచి 4.5 కోట్ల వ‌ర‌కు డిమాండ్ చేస్తుంద‌ని నెట్టింట‌ టాక్ నడుస్తోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది తెలియాల్సి ఉంది.(Rashmika Mandanna)

Also Read: Eagle: ఈగల్ మూవీ ఫస్ట్ రివ్యూ.. ర‌వితేజ‌కు హిట్ ప‌డేనా..?

కాగా, ర‌ష్మిక మంద‌న్నా చేతిలో ప్ర‌స్తుతం ఐదు సినిమాల వ‌ర‌కు ఉన్నాయి. అందులో పుష్ప 2 ది రూల్ ఒక‌టి. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం 2024లో విడుద‌ల అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. అలాగే ధ‌నుష్‌కు జోడీగా శేఖ‌ర్ క‌మ్ముల‌తో ర‌ష్మిక ఓ సినిమాకు క‌మిట్ అయింది. రెయిన్ బో, ది గర్ల్‌ఫ్రెండ్ అనే రెండు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో న‌టిస్తోంది. మ‌రోవైపు బాలీవుడ్ లో విక్కీ కౌశల్ తో క‌లిసి ఛావా ది గ్రేట్ వారియర్ అనే పీరియడ్ డ్రామాలో ర‌ష్మిక భాగ‌మైంది.

Join WhatsApp